సంచలనం: ట్రంప్ ‘ఊ’ అంటే చాలు.. చైనాపై అణుదాడులు: నౌకాదళ కమాండర్‌

అమెరికా ఫసిఫిక్‌ మహా సముద్ర నౌకాదళ కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై అణు దాడులకు సిద్ధంగా ఉన్నామని, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తే..

వాషింగ్టన్: అమెరికా ఫసిఫిక్‌ మహా సముద్ర నౌకాదళ కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాపై అణు దాడులకు సిద్ధంగా ఉన్నామని, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తే.. వచ్చే వారంలోనే అణుదాడులు చేయనున్నట్లు చెప్పారు.

ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తే చైనాపై వచ్చే వారంలో అణుదాడులు చేస్తారా? అని వేసిన ప్రశ్నకు ఆయన 'అవును' అని బదులిచ్చారు. అమెరికా మిలటరీలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడతామని, ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి ప్రజలను సంరక్షిస్తామని ప్రమాణం చేస్తారని అన్నారు.

US admiral ready for nuclear attack on China if ordered by Donald Trump

ఇప్పటికే పసిఫిక్‌ మహా సముద్రంలో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రం తమదేనని వాదిస్తూ చైనా నౌకల సంచారం కొనసాగిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో నౌకాదళ కమాండర్‌ అడ్మిరల్‌ స్కాట్‌ స్విఫ్ట్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇటీవల జిబోటిలో సైనిక స్థావరం ఏర్పాటు చేయడం ద్వారా చైనా హిందూమహా సముద్ర ప్రాంత దేశాలతో కయ్యానికి కాలుదువ్వే విధంగా వ్యవహరించింది. ఈ పరిణామం ఆయా దేశాల్లో చిచ్చుపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా పెద్ద ఎత్తున సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల ద్వారా తమ సైనిక బలాన్ని చైనాతో సహా ఇతర శత్రుదేశాలకు అమెరికా, ఆస్ట్రేలియా చాటిచెప్పాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+