చైనా డ్రోన్లు ఉపయోగించవద్దు: అమెరికా ఆదేశాలు
చైనాకు చెందిన డ్రోన్లను ఉపయోగించవద్దని అమెరికా తన ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. చైనా కంపెనీ ఎస్‌జడ్ డీజేఐ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన డోన్ల వినియోగాన్ని నిలిపి వేయాలని చెప్పింది.
వాషింగ్టన్: చైనాకు చెందిన డ్రోన్లను ఉపయోగించవద్దని అమెరికా తన ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. చైనా కంపెనీ ఎస్‌జడ్ డీజేఐ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన డోన్ల వినియోగాన్ని నిలిపి వేయాలని చెప్పింది.
సైబర్ ముప్పు ఆందోళనలే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఆదేశాల మేరకు డీజేఐ కంపెనీ తయారు చేసిన అన్ని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను, బ్యాటరీలను, స్టోరేజీ వనరులను తొలగించాల్సి ఉంటుంది.

అమెరికా సైన్యం డీజేఐ సంస్థ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తోంది. దీనిపై డీజేఐ సంస్థ స్పందించింది. ఇది ఆశ్చర్యకరం, అసంతృప్తికరమని పేర్కొంది. నిర్ణయం తీసుకునేటప్పుడు తమను సంప్రదించలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications