బూస్టర్ డోస్‌కి ఓకే..? బలహీనంగా ఉన్నవారికే.. అక్కడ.. మాత్రమే
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు బూస్టర్ కోవిడ్ టీకా డోసు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. దేశంలో మరోసారి కరోనా మహహ్మారి విజృంభిస్తోందని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మళ్లీ కరోనా ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. వీక్‌గా ఉన్నవారు అదనపు డోసు టీకా తీసుకోవాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.
అమెరికాలో మూడు శాతం మందిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఆ దేశంలో ఫైజర్, మోడెర్నా టీకాలను ఇచ్చారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లు.. ఆయా టీకా అదనపు డోసులను తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరింది. మందులు వాడుతున్నవారు.. ఇమ్యూనిటీని తగ్గించే వ్యాధులు ఉన్నవారు.. కోవిడ్ టీకాల నుంచి రక్షణ పొందనివారు.. మరో డోసు టీకాను తీసుకోవాలని ఎఫ్‌డీఏ తెలిపింది. అవయవ మార్పుడులు జరిగిన రోగుల్లో కోవిడ్ టీకాలతో కేవలం 15 శాతం మాత్రమే రక్షణ ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాంటి వారు మూడవ డోసు తీసుకోక తప్పదు. ట్రాన్స్‌ప్లాంట్ రోగుల్లో మూడవ డోసు అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications