• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: అమెరికాలో మృత్యుఘోష.. చైనాను ఏకేపనిలో ట్రంప్ బిజీ.. 34వేల మంది బలి

|

ప్రపంచ పెద్దన్న అమెరికా కనీవినీ ఎరగని కష్టాన్ని అనుభవిస్తున్నది. కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తున్నది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 6.53లక్షలకు పెరగ్గా, మరణాల సంఖ్య 34వేలకు చేరింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవాళ్లలో మరో 13,536 మంది కండిషన్ క్రిటికల్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 21లక్షలకు, మరణాల సంఖ్య 1.43లక్షలకు పెరిగింది.

శవాల దిబ్బ న్యూయార్క్..

శవాల దిబ్బ న్యూయార్క్..

దేశంలో సంభవించిన మరణాల్లో సగానికి సగం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదుకావడం విషాదకరం. న్యూయార్క్ లో కేసుల సంఖ్య 2.14లక్షలుకాగా, అత్యధికంగా 14,073 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీలో 3,156 మంది, మసాచుసెట్స్ లో 1,108మంది, మిషిగన్ లో 1921మంది చనిపోయారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు రికార్డవుతూ వచ్చాయి. గురువారం కూడా అదే జరిగింది.

వూహాన్ ల్యాబ్ ఫైల్స్..

వూహాన్ ల్యాబ్ ఫైల్స్..

కరోనా వైరస్ ప్రమాదాన్ని ప్రపంచ దేశాలకు చెప్పకుండా దాచి, చైనా తీవ్ర తప్పిదానికి పాల్పడిందని ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చిన అమెరికా.. తాజాగా ‘వూహాన్ ల్యాబ్ ఫైల్స్'ను మరోసారి తెరపైకి తెచ్చింది. చైనా, హుబే ఫ్రావిన్స్ లోని వూహాన్ సిటీలోని ఓ ల్యాబ్ లో చైనీస్ సైంటిస్టులు కరోనా వైరస్ పై ప్రయోగాలు చేశారన్నది ఆ ఫైల్స్ సారాంశం. ఈ థియరీ మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాజా వ్యాఖ్యలతో మళ్లీ దుమారం చెలరేగింది. చైనా తాను తప్పుచేయలేదని ప్రపంచానికి నిరూపించుకోవాలని ప్రెసిడెంట్ ట్రంప్, మంత్రి పాంపియో సవాలు చేశారు.

22 లక్షల ఉద్యోగాలు గోవిందా..

22 లక్షల ఉద్యోగాలు గోవిందా..

అమెరికాలో కరోనా షట్ డౌన్ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు హరించుకుపోయాయి. ఏప్రిల్ 11 నాటికి 5.24 మిలియన్ల మంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. వాళ్లతో కలిసి మొత్తం 22 లక్షల మంది జాబ్ లెస్ అయినట్లు యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ గురువారం వెల్లడించింది. కాగా, ఆర్థిక వ్యవస్థను, వ్యాపార, వాణిజ్యాలను తిరిగి ప్రారంభించేందుకు ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఇబ్బందికరంగా మారింది.

  New Infection In 3 To 11 Years Of Age Kids In AP
  వైరస్ పై రాజకీయాలు..

  వైరస్ పై రాజకీయాలు..

  అమెరికాలో వైరస్ ప్రభావం, షట్ డౌన్ ముగింపుపై అంతర్గతంగా ప్రెసిడెంట్, గవర్నర్ల మధ్య రచ్చ నడుస్తోంది. తాను చెప్పినట్లు వినాలని ట్రంప్ అంటుంటే, కుదరదు పొమ్మని గవర్నర్లు ధిక్కరిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల కన్జర్వేటివ్ వర్గీయులు.. లాక్ డౌన్ ను ధిక్కరిస్తూ, రోడ్లపై ఆయుధాలతో ఆందోళనలు చేపట్టారు. అంతర్గాతీయంగానూ ట్రంప్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాపై నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్నారు. వూహాన్ ల్యాబ్ రిపోర్టులపై స్పందించిన చైనా.. ఆ వైరస్ తాము సృష్టించింది కాదని మరోసారి స్పష్టత ఇచ్చింది.

  English summary
  The confirmed coronavirus death toll in the United States reached to 34,000 on Thursday. US presses China on coronavirus after lab reports
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X