ఆత్మహుతి దాడి చేసే యత్నం: నిలువరించిన అమెరికా దళం
ఆప్ఘనిస్తాన్‌లో ఉత్కంఠ భరిత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైనికులు లక్ష్యంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి అమెరికా కూడా ప్రతీ చర్యలు చేపడుతోంది. ఆప్ఘనిస్తాన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడికి యత్నించిన దళ సభ్యుడిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి.
తమ దేశ పౌరులు తరలింపు ప్రక్రియను అమెరికా చేపడుతోంది. ఈ క్రమంలో ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్దంగా ఉన్న వ్యక్తిపై అమెరికా బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఐసిస్ కే గ్రూపునకు చెందినవాడు అని భావిస్తున్నారు. ఒకేరోజు రెండు వేర్వేరు ఘటనలతో కాబుల్ దద్దరిల్లిపోయింది.
ఇటీవల కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన పేలుళ్లలో 100 మందికి పైగా చనిపోయారు. 13 మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది.. ఇద్దరు ముష్కరులను అమెరికా దళాలు శనివారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తమ సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని అమెరికా ప్రతీనబూనింది. ఆ మేరకు వైమానిక దాడులకు దిగింది.

ఇటు కాబూల్‌లో ఇవాళ మరోసారి పేలుడు జరిగింది. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. అమెరికా సైనికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. ఇది కూడా ఐసిస్ పనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద దాడిని ముందే అనుమానించిన అమెరికా... ఆ దాడుల తర్వాత కూడా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడి జరిగిందని తెలుస్తోంది. తాజా పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది, వారిలో ఒకరు చిన్నారి అని సమాచారం.
వరుస బాంబు పేలుళ్లతో అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది. కాబూల్‌లో మరిన్ని బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందనే అమెరికా హెచ్చరికల సమయంలోనే ఇవాళ కాబూల్‌లో మరో భారీ పేలుడు సంభవించింది. ఓ రాకెట్... ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ని ఢీకొట్టిందని..పేలుడుకి ఇదే కారణమని ప్రాథమిక సమాచారం. ఇటీవలే కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 150 మందికి పైగా అప్ఘాన్ పౌరులు,అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటికే ఐసిస్-కే ఉగ్రసంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications