• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాన్‌స్పిరసీ థియరీ: డొనాల్డ్ ట్రంప్ వెంట అజ్ఙాత మహిళ: ఆమె ఎవరు?: భార్య మెలానియాను కాదని

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కొత్త వివాదాలను ఆయన కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ర్యాలీలు, డిబేట్లలో ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ ఆధిపత్యాన్ని సాధిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా చెలరేగిన వివాదం.. ట్రంప్‌నకు మరిన్ని ఇబ్బందును సృష్టించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఆ స్టేట్‌లో గెలిస్తే..గెలిచినట్టే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదో సెంటిమెంట్: ట్రంప్ ఫోకస్

ఎవరా అజ్ఙాత మహిళ..

కొద్దిరోజులుగా డొనాల్డ్ ట్రంప్ తన వెంట ఓ అజ్ఙాత మహిళను తీసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సెమినార్లు, డిబేట్లలో ఆమె డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉంటున్నారు. మొదట- ఆమెను అమెరికా మొదటి మహిళ, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌‌గా భావించారు. మెలానియా అనే నిర్ధారించుకున్నారు. తీరా ఫొటోలను క్లోజప్‌లో పరిశీలించగా.. ఆమె మెలానియా కాదని తేలింది. తన భార్యలాగే ట్రంప్.. ఆమెను వెంటబెట్టుకుని తిరుగాడటాన్ని రాజకీయ ప్రత్యర్థులు తప్పుపడుతున్నారు. గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

మెలానియాకు డూప్‌గా..

ఆ అజ్ఙాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో అది. ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్.. తన అభిమానులను ఉద్దేశించి అభినందనలు తెలియజేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె.

ఎలా నిర్ధారించారంటే..?

నల్లరంగు డ్రెస్, అదే రంగు కళ్లద్దాలను ధరించి చిరునవ్వుతో కనిపించిన ఆమెను అందరూ మొదట మెలానియా ట్రంప్‌గా భావించారు. చివరికి ఆమె కాదని తేల్చారు. నవ్వుల తేడా కొట్టడం, పళ్ల వరుస భిన్నంగా కనిపించడాన్ని బట్టి.. ఆమె మెలానియా కాదని తేల్చి పారేశారు నెటిజన్లు. మెలానియా ట్రంప్ ఎత్తుతో సరిపోకపోవడం కూడా దీనికి ఓ కారణమైందని చెబుతున్నారు. దీన్ని బట్టి- డొనాల్డ్ ట్రంప్ కాన్‌స్పిరసీ థియరీకి తెర తీశారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతున్నాయి. #FakeMelania అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్‌ చేశారు నెటిజన్లు.

బాడీ డబుల్..

మెలానియా డూప్‌ను ట్రంప్ వెంటబెట్టుకుని తిరుగుతున్నారని అనుమానిస్తున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సెమినార్లు, డిబేట్లలో పాల్గొనడానికి మెలానియా అంగీకరించకపోవడం వల్ల ఆమె బాడీ డబుల్‌ను డొనాల్డ్ ట్రంప్‌ను వెంట తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం.. పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతమే అయినప్పటికీ.. అది కాస్తా ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. బాడీ డబుల్, కాన్‌స్పిరసీ థియరీకి ట్రంప్ పాల్పడుతున్నారనే విమర్శలు అప్పుడే ఆరంభం అయ్యాయి కూడా. 2017-2018 మధ్యకాలంలోనూ ట్రంప్.. మెలానియా బాడీ డబుల్‌ చేశారనీ చెబుతున్నారు.

మెలానియా ఎందుకు రావట్లేదు?

దీని ప్రబావం ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్-మెలానియా ట్రంప్ మధ్య సత్సంబంధాలు లేవనే విషయాన్ని ఈ ఫేక్ మెలానియా ట్రంప్ ఉదంతం బయట పెట్టిందని, భార్యతో సఖ్యతగా లేని వ్యక్తి దేశాన్ని ఎలా పాలిస్తాడనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. ట్రంప్ వెంట ఎన్నికల పర్యటనలకు మెలానియా ఎందుకు రావట్లేదనే డిబేట్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

English summary
A picture of the US First Lady Melania Trump has sparked the resurgence of a conspiracy theory that Donald Trump uses a body double to stand in for his wife. The hashtag #FakeMelania started trending on Twitter at the weekend after a picture emerged of Melania Trump boarding Marine One.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X