సినిమాలకు 'గుడ్ బై' చెప్పనున్న 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ..!!
తమిళ చిత్ర పరిశ్రమతోపాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ.. తమిళ ప్రేక్షకులకు విజయ్ ఆంటోనీ సుపరిచితమే.. కానీ తెలుగువారికి మాత్రం 'బిచ్చగాడు' హీరో అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. అలా ఒక్క సినిమాతోనే తెలుగులోనూ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నారు విజయ్ ఆంటోనీ. విజయ్ ఆంటోనీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా బిచ్చగాడు.. తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక కోటీశ్వరుడు 48 రోజులు పాటు చిచ్చగాడిగా మారతాడు. ఈ ఎమోషనల్ డ్రామా టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే రూ. 25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది.
అయితే ఈ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా 2023 లో విడుదలైంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో బిచ్చగాడు సినిమాతోపాటు నకిలీ, డాక్టర్ సలీమ్, భేతాళుడు, రోషగాడు, లవ్ గురు ఇలా అనేక సినిమాలు చేశారు. ఇక విజయ్ ఆంటోనీ సినిమాల్లో స్టార్ హీరో ఇమేజ్ కంటే కథా బలమే ఎక్కువగా ఉంటుంది.
ఆయన సినిమాలు అన్నీ సస్పెన్స్, సైకాలాజికల్, ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందించినవే. అలాగే విజయ్ ఆంటోనీ తన సినిమాల్లో కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా ఇలా అనేక బాధ్యతలు తీసుకుంటారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ అని బ్యానర్ నెలకొల్పి తమిళంతోపాటు తెలుగులోనూ డైరెక్ట్ గా సినిమాలు చేస్తుంటారు విజయ్ ఆంటోనీ.

అయితే విజయ్ ఆంటోనీ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన నూరుసామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఈ చిత్రంలో రైతుగా నటించారు.. కదా ఆ అనుభవం ఎలా ఉంది..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. విజయ్ ఆంటోనీ సమాధానం చెప్తూ.. 'నేను ఎప్పుడూ ఆహ్లాదకరమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తిని. ప్రస్తుతం నాకు చెన్నైలో పని ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నేను ఎక్కువగా అక్కడే ఉండాల్సి వస్తోంది. నాకు సాధనమైన జీవిన శైలి అంటేనే ఇష్టం. విలేజ్ లో జీవించడం ఇష్టం. రాబోయే రెండు మూడేళ్లలో పొలాచ్చి ప్రాంతంలో ఒక స్థలం కొనుగోలు చేసి అక్కడే స్థిరపడతాను.. అని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications