బాలయ్య- గోపిచంద్ మలినేని మూవీ గ్లింప్స్ రిలీజ్.. న్యూ ఏజ్ విధ్వంసం..
'తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. చూస్తే బాలయ్య సినిమానే చూడాలి'.. అనే విధంగా ఐదు దశాబ్దాలుగా వెండి తెరపై రారాజులా వెలుగుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తెలుగు చిత్ర సీమలో డైలాగ్ చెప్పాలన్నా, డ్యాన్స్ లు వేయాలన్నా.. యాక్షన్ చేయాలన్నా నందమూరి బాలకృష్ణ దిగనంత వరకే.. ఒన్స్ ఆయన స్టెప్ ఇన్ అయితే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలను మించిన ఎనర్జీ.. జోష్ తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ ప్రజా సేవ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిని నింపుతున్నారు బాలయ్య. ఇవాళ నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

అయితే బాలయ్య బర్త్ డే సందర్భంగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ నుంచి గ్లింప్స్ తాజాగా విడుదలైంది. గ్లింప్స్ లో బాలయ్య స్టైల్ అద్దిరిపోయింది. ముఖ్యంగా సిగరెట్ పీల్చుతూ విలన్స్ ను కొట్టే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. బైక్ పై ఉండి గన్ తో విలన్స్ ను కాల్చే సీన్స్ గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచాయి. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడు గోపిచంద్ మలినేని ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒక నిమిషం 31 సెకన్లపాటు గూస్ బంప్స్ గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ అంతకు మించి ఉండబోతుందని అర్థం అవుతోంది.
ఈ చిత్రం ముంబై నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ భారీ కమర్షియల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పించనున్నారు. అలాగే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అలాగే మూవీ టైటిల్ ను కూడా రిలీజ్ చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications