వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#CountEveryVote: లెక్కింపుపై గొడవ: ట్రంప్, జో మద్దతుదారుల పోటాపోటీ ర్యాలీలు: నిరసనల హోరు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ముగింపుదశకు వస్తోన్న కొద్దీ.. ఉత్కంఠ వాతావరణం నెలకొంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌కు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బ్యాలెట్ పత్రాల లెక్కింపులో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కిటికీ అద్దాలను కప్పేసి, అబ్జర్వర్లను బయటికి పంపి: బ్యాలెట్ల కౌంటింగ్: ట్రంప్ డౌట్లు నిజమేనా? కిటికీ అద్దాలను కప్పేసి, అబ్జర్వర్లను బయటికి పంపి: బ్యాలెట్ల కౌంటింగ్: ట్రంప్ డౌట్లు నిజమేనా?

ఓట్లను మళ్లీ లెక్కబెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు. జో బిడెన్‌కు మద్దతుగా డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులు కూడా రోడ్డెక్కారు. ర్యాలీలను చేపట్టారు. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలన్నీ ఈ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తిపోతున్నాయి. రీకౌంటింగ్ తరువాతే.. ఫలితాలను వెల్లడించాలని ఆ ఇద్దరు నేతల మద్దతుదారులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో #CountEveryVote అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

US Election Result 2020: As vote count continues, Biden and Trump supporters conduct rallies

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారని, అయినప్పటికీ. ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల అధికారులు, కౌంటింగ్ సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ బిడెన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ మెజారిటీని సాధించడానికి ఇదే ప్రధాన కారణమని విమర్శిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్లను మళ్లీ లెక్కబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కౌంట్ ఎవెరీ ఓట్, ట్రంప్ అవుట్.. అనే బ్యానర్లను వారు ప్రదర్శిస్తున్నారు. చికాగో, న్యూయార్క్, ఫ్లోరిడా వంటి చోట్ల ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

అదే సమయంలో- డెట్రాయిట్‌లో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు భారీ ర్యాలీని నిర్వహించారు. డౌన్‌టౌన్ డెట్రాయిట్, దుర్హం వంటి చోట్ల ప్రదర్శనలతో హోరెత్తించారు. డెట్రాయిట్‌లోని టీసీఎఫ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఎన్నికల పరిశీలకులను బయటికి పంపించి, కిటికీ అద్దాలను మూసివేసి.. మరీ బ్యాలెట్ ఓట్లను లెక్కించారని, ఆ తరువాతే.. జో బిడెన్‌కు మెజారిటీ లభించిందని ఆరోపించారు. మిచిగాన్ స్టేట్‌లో రీ కౌంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
As counting continues in the US presidential elections, Joe Biden supporters marched in New York to demand every vote be counted, as President Trump's supporters protested in Detroit demanding a halt to ballot counting in Michigan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X