వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అధ్యక్షుడెవరో తేల్చేసిన కాలిఫోర్నియా: మేజిక్ ఫిగర్‌కు అతి చేరువలో: మనోళ్ల ఓటుబ్యాంకు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి కొనసాగుతోన్న రేసులో విజేత ఎవరో ఇప్పుడిప్పుడే స్పష్టమౌతోంది. ఇప్పటిదాకా హోరాహోరీగా సాగిన పోరు.. ఒక్కసారిగా ఏకపక్షంగా మారిపోయింది. దీనికి ఒకే ఒక్క కారణం.. కాలిఫోర్నియా. అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న కాలిఫోర్నియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయాన్ని సాధించారు. ఈ స్టేట్‌లో 55 ఎలక్టోరల్ ఓట్లు బిడెన్‌కు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా జో బిడెన్..మేజిక్ ఫిగర్‌కు చేరువ అయ్యారు. అమెరికా అధ్యక్ష పదవిని సాధించాలంటే.. అత్యంత కీలకంగా భావించే స్టేట్ ఇది. ఇక్కడ బిడెన్ మెజారిటీని అందుకోవడం ఫలితం ఏమిటనేది తేటతెల్లమైంది.

 US Election Result 2020: Joe Biden won California, Oregon and Washington

చాలా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను కనపరుస్తున్నప్పటికీ.. కాలిఫోర్నియా తరువాత ఆధిక్యత మారిపోయింది. కాలిఫోర్నియాలో 70 శాతం ఓట్లు బిడెన్‌కు పోల్ అయ్యాయి. కాలిఫోర్నియా ఫలితం తరువాత జో బిడెన్్ 223 స్థానాల్లో ఆధిక్యతను సాధించగా.. ట్రంప్ 148 వద్ద ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 270. భారతీయుల ఓటుబ్యాంకు అధికంగా ఉండే రాష్ట్రాల్లో జో బిడెన్ భారీ మెజారిటీని సాధించారు. డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా ఉండే మీడియా ఫాక్స్ న్యూస్ కూడా.. జో బిడెన్ గెలుస్తాడని అంచనా వేసింది. బిడెన్ మెజారిటీ సాధిస్తారని స్పష్టం చేసింది.

English summary
Democrat Joe Biden has won California, Oregon and Washington state, while President Donald Trump has won Idaho. California, Oregon and Washington are all liberal states, while Idaho is conservative. In California, 70% votes goes to Biden and only 28% to Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X