భారత్ కు అమెరికా బిగ్ షాక్..! రష్యా-ఇరాన్ పై కోపం మన మీద..!
ఇరాన్ (iran)పై ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించడమే కాకుండా దాన్ని ఎలా ముగించాలో తెలియక సతమతం అవుతున్న అమెరికా (US)లో అసహనం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో తమను ముప్పుతిప్పలు పెడుతున్న ఇరాన్ తో పాటు దానికి సహకరిస్తున్న దేశాలపై మరోసారి ఉరుముతోంది. ఇందులో భాగంగా భారత్ కు షాకిచ్చింది. రష్యా-ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షల మినహాయింపును పొడిగించబోమని అమెరికా తేల్చేచెప్పేసింది.
అమెరికా ఆంక్షలను ఎదుర్కోకుండా కొంతమేరకు ఇరాన్, రష్యా చమురును కొనుగోలు చేయడానికి గతంలో అనుమతించిన మినహాయింపులను పునరుద్ధరించబోమని అమెరికా ప్రకటించింది. హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల మధ్య రష్యా చమురు కొనుగోలును కొనసాగించడానికి ఈ మినహాయింపులు వీలు కల్పించడంతో భారత్ ప్రధాన లబ్దిదారు అయింది.
హార్ముజ్ లో నౌకలు చిక్కుకుపోతున్న వేళ భారత్ కు ముఖ్యంగా రష్యా చమురు బాగా పనికొచ్చింది.

రష్యా చమురుపై ఉన్న సాధారణ లైసెన్సును పునరుద్ధరించబోమని, అలాగే ఇరాన్ చమురుపై ఉన్న సాధారణ లైసెన్సును కూడా పునరుద్ధరించబోమని అమెరికా ఆర్ధిక మంత్రి స్కాట్ బెస్సెంట్ తెలిపారు. మార్చి 11కి ముందు సముద్రంలో ఉన్న చమురు అంతా ఇప్పటికే వాడుకున్నారని తెలిపారు. హార్ముజ్ లో అంతరాయాల కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగకుండా అమెరికా ఈ మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వాటిని ఎత్తేయడంతో అంతర్జాతీయంగా చమురు ధరల మంట తప్పేలా లేదు. దీంతో భారత్ కచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడమా లేక ధరల పెరుగుదలకు సిద్దం కావడమా అన్నది తేలాల్సి ఉంది.
-
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!













Click it and Unblock the Notifications