ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. 40 రోజులకుపైగా యుద్ధం చేసుకున్న ఇరాన్- అమెరికా మధ్య సంధి కుదుర్చేందుకు పాకిస్థాన్ యత్నించింది. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇక ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక చర్చలు విఫలమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తూ అమెరికన్ నేవీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచ దేశాల కోసం హర్మూజ్ ను తెరిచి ఉంచాం. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి రాదు. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. త్వరలో చైనాలో పర్యటిస్తా.ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా మాకు హామీ ఇచ్చింది" అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో తమ సైన్యాన్ని ఎవరూ మించలేరని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.

" హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చైనా.. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయనని స్పష్టం చేసింది. చైనాతో పాటు మిగతా దేశాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకొన్ని వారాల్లో చైనాలో పర్యటిస్తాను. చైనా వెళ్లినప్పుడు నన్ను జిన్ పింగ్ గట్టిగా హగ్ చేసుకుంటాడని ఆశిస్తున్నా" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇదే విషయాన్ని తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు చేశారు.

Trump Announce Permanent Opening of Strait of Hormuz China and Others Express Satisfaction Decision

అలాగే ఇరాన్ ఏ దేశమైనా ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చైనా కూడా ఈ రూల్స్ కు కట్టుబడి ఉంటుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ కు ఆయుధాలు చేరవేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఇప్పటికే చైనా ఖండించింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామాల మధ్య ఫైనాన్సిషల్ టైమ్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ తన దాడుల కోసం చైనాకు చెందిన TEE-01B అనే స్పై శాటిలైట్ ను ఉపయోగిస్తోందని ఆ కథనంలో స్పష్టం చేసింది. ఈ శాటిలైట్ సంకేతాల ద్వారా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా పెడుతున్నట్లు ఈ కథనం పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+