భారత్ కు యూఎస్ షాక్ ? కెనడాతో పోరులో ప్రత్యేక మినహాయింపేదీ ఉండదని క్లారిటీ..!
కెనడా పౌరుడైన ఖలిస్తాన్ తీవ్రవాద సంస్ధ టైగర్ ఫోర్స్ వ్యవస్ధాపకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ కాల్చివేత వ్యవహారం భారత్ కు చికాకుగా మారుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో భారత్ పై చర్యలు కోరుతూ తన మిత్రదేశాల్ని ఆశ్రయించిన కెనడాకు అమెరికా ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేవీ ఉండబోని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ఓ ప్రకటన చేశారు.
కెనడా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చారనే ఆరోపణలపై న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇరుదేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.ఈ అంశంపై ఇప్పటికే జరిగిన లేదా జరగబోయే ప్రైవేట్ దౌత్య సంభాషణల జోలికి తాము వెళ్లడం లేదని, అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దౌత్యపరమైన వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇది తమకు ఆందోళన కలిగించే విషయమని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జేక్ తెలిపారు. దీనిపై తాము నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో భారతదేశానికి ప్రత్యేక మినహాయింపేమీ లేదని కూడా ఆయన తేల్చిచెప్పేశారు.నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో తాజాగా ఆరోపించారు. దీన్ని భారత్ తోసిపుచ్చింది. అనంతరం భారత దౌత్యవేత్యను కెనడా బహిష్కరిస్తే.. కెనడా దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది.
భారత్‌తో తమ సంబంధాల నేపథ్యంలో కెనడా చేస్తున్న ఆరోపణల విషయంలో మెతక వైఖరి అనుసరిస్తారన్న ఊహాగానాల్ని భద్రతా సలహాదారు జేక్ తోసిపుచ్చారు. ఈ మేరకు కెనడా ఆరోపణలను బైడెన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. అలాగే కెనడాతో నిరంతర టచ్ లో ఉందన్నారు. ఇలాంటి చర్యలకు ఇండియాకు మాత్రం ప్రత్యేక మినహాయింపులు లేవన్నారు. దేశంతో సంబంధం లేకుండా, మేము నిలబడి మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటామన్నారు. కెనడా వంటి మిత్రదేశాలు వారి చట్ట అమలు మరియు దౌత్య ప్రక్రియను కొనసాగించేటప్పుడు మేము వారితో కూడా సన్నిహితంగా సంప్రదిస్తామన్నారు.












Click it and Unblock the Notifications