వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ దూకుడు, సరైన పత్రాలు లేకపోతే ఇక ఇంటికే, ఎయిర్ పోర్ట్ ల్లో చెకింగ్ ఇలా...

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింంగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేస్తున్నాడు.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీలను ఆయన అమలు చేసే పని చేస్తున్నాడు.ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కాని, తాను అనుకొన్న పనిచేసేందుకు ట్రంప్ వెనుకాడడం లేదు.సరైన డాక్యుమెంట్లు లేని 1.1 కోట్ల మందిని అమెరికా నుండి స్వదేశాలకు తిప్పిపంపేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తగిన పత్రాలు లేకుండా తమ దేశంలో తిరుగుతున్నట్టుగా భావిస్తున్న కొంత మంది వ్యక్తుల కోసం అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రోటెక్షన్ విభాగం తనిఖీలు మొదలుపెట్టింది.

సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తోన్న వారిని స్వదేశాలకు పంపేందుకు అమెరికా చర్యలు తీసుకొంటుంది.న్యూయార్క్ విమానాశ్రయంలో ఇలా దిగుతాడని భావించిన ఓ వ్యక్తి కోసం గాలింపు చర్యలను చేపట్టిన అధికారులు ప్రతి ప్రయాణీకుడి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.

US Immigration Officers Are Now Checking IDs On Domestic Flights?

శాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చిన డెల్టా ప్లైట్ 1983 లో వచ్చిన ప్రయాణీకులంతా తమ గుర్తింపు కార్డులు చూపించాలని సీబిపి ఏజంట్లు అడిగారు. ఆ విమానం జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ల్యాండైన వెంటనే ప్రయాణీకులు దిగగానే తనిఖీలు చేశారు.

అయితే అధికారులు వెతుకుతున్న వ్యక్తి డిపార్టేషన్ ఉత్తర్వులు వెళ్ళాయి. అతడు పలు నేరాల్లో దోషిగా తేలాడని సీబీసి అధికారులు చెప్పారు. గృహ హింసతో పాటు ఇతర నేరాల్లో కూడ అతడు దోషిగా నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావించారు.

అధికారులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించే విషయాన్ని ప్రయాణీకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుత ఫెడరల్ చట్టాల ప్రకారంగా ఒక వ్యక్తిని ఎలా గుర్తించి అదుపులోకి తీసుకొంటారని కూడ ప్రశ్నిస్తున్నారు.

English summary
According to a CBP spokesman, the agency “was contacted by U.S. Immigration and Customs Enforcement (ICE) yesterday, February 22, 2017, to assist in locating an individual possibly aboard Delta flight 1583 from San Francisco International Airport to JFK. This individual was ordered removed by an immigration judge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X