అమెరికా సైనికుల్ని చంపితే 11 కోట్లు- ఇరాన్ లో సైనికాధికారుల జాడ చెప్తే 143 కోట్లు ..!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు (US-Iran Escalation) మరోసారి తారా స్దాయికి చేరాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగే వరకూ ఆగి, ఆ తర్వాత ఒక్కసారిగా ఇరాన్ పై విరుచుకుపడేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులు వేస్తుంటే.. అప్పటివరకూ ఎందుకు ఇప్పుడే మొదలుపెట్టేద్దాం అంటోంది ఇరాన్. దీంతో ఇరు దేశాల మధ్య పోరు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరు దేశాలూ ప్రత్యర్థుల్ని పట్టిస్తే, చంపితే భారీ ఎత్తున పారితోషికాలు ఇస్తామని ప్రకటించాయి. దీంతో ఈ డబ్బులకు ఆశపడి అయినా ప్రత్యర్థుల సమాచారం ఇచ్చేందుకు లేదా హతమార్చేందుకు ఎవరైనా ముందుకొస్తారని ఇరుదేశాలూ అంచనా వేస్తున్నాయి.
ఒక అమెరికన్ సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 40వేల డాలర్లు అంటే 11 కోట్లు ఇస్తామంటూ ఇరాన్ సైనిక ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా ప్రకటించారు. అమెరికా శత్రువుపై ఈ జిహాద్లో పాల్గొనాలని ప్రజలు, దాతలు కోరుకున్నప్పటికీ, పోరాడటానికి శారీరక సామర్థ్యం లేని కాలం నాటిది ఇది అక్రమినియా ఓ వీడియోలో వెల్లడించారు. కాబట్టి అమెరికా సైనికుల్ని చంపే వారికి ఈ భారీ ఆర్థిక సహాయం అందించగలమని, అవసరమైన నిధులను అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఒక అమెరికన్ సైనికుడిని పట్టుకున్నా లేదా అతని అవశేషాలను అధికారులకు అప్పగించినా, ఆ ఇరాన్ పౌరునికి సుమారు 20 వేల డాలర్ల బహుమతి ఇస్తామని, ఆ పౌరురాలు మహిళ అయితే, బహుమతి రెట్టింపు అయి 40 వేల డాలర్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఇరాన్ సైనిక విభాగమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడంలో సహాయపడే సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్లు బహుమతిని ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. తద్వారా, ఆ దేశానికి ఆయుధాలు, నిధులు అందకుండా అడ్డుకునేందుకు అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం కోసం అమెరికా గతంలో కూడా భారీ మొత్తంలో బహుమతులను ప్రకటించింది. గత ఆగస్టులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని ఏరోస్పేస్ విభాగానికి చెందిన ముగ్గురు అధికారుల సమాచారం ఇస్తే 10 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది.














Click it and Unblock the Notifications
