లఖ్వీ విడుదలపై అమెరికా తీవ్ర ఆగ్రహం, భారత్‌పైకి నెపం నెట్టిన పాక్
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదుల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడం పైన అమెరికా, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కుట్రదారులకు శిక్ష పడేలా చేస్తామన్న హామీకి పాకిస్తాన్ కట్టుబడాలని, ఈ విషయాన్ని ఆ దేశానికి చెప్పామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెఫ్ రాఠ్కే పేర్కొన్నారు.
లఖ్వీ విడుదలపై ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దాడుల బాధితులను అవమానించడమేనని ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మాస్ అన్నారు.

లఖ్వీ విడుదలపై విమర్శలపై స్పందించిన పాకిస్తాన్ నెపం భారత్ పైనే మోపింది. కేసు విషయంలో భారత్ సహకరించేందుకు ఆలస్యం చేసిందని, కేసు సంక్లిష్టంగా మారిందని, ప్రాసిక్యూషన్ బలహీనపడిందని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
శివసేన నిరసన
ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేసినందుకు నిరసనగా శనివారం ముంబైలో ఆ దేశ జెండాలను, ప్రధాని నవాజ్ షరీఫ్ చిత్రపటాలను దగ్ధం చేస్తున్న శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోను శివసేన నిరసన చేపట్టింది.












Click it and Unblock the Notifications