ఆ సముద్రంలో అపార సంపద.. ఆధిపత్యం కోసం చైనా తహతహ.. అమెరికా, జపాన్ సీరియస్

Posted By:
Subscribe to Oneindia Telugu

మనీలా: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ దీవులను ఏర్పాటు చేయడాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని, సైనికీకరణను అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.

అడుగేస్తే యుద్ధమే: చైనా హూంకరింపు, బుద్ధి చెప్పేందుకు భారత్ మాస్టర్ ప్లాన్

ఉత్తరకొరియాతో ప్రపంచానికే ముప్పు: ట్రంప్, మూన్ జే-ఇన్‌తో మంతనాలు, 'వెయ్యి రెట్టు ప్రతీకారం'!

చైనా పట్ల ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్‌) వైఖరి మెత్తబడ్డ తరుణంలో ఈ మూడు దేశాలు ఆదివారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ నిరుడు ఇచ్చిన తీర్పును చైనా, ఫిలిప్పీన్స్‌ గౌరవించాలని డిమాండ్‌ చేశాయి.

అపార సంపద.. అందుకే ఆధిపత్య పోరు

అపార సంపద.. అందుకే ఆధిపత్య పోరు

దక్షిణ చైనా సముద్రం గుండా ఏటా సుమారు ఐదు లక్షల కోట్ల డాలర్ల నౌకా వాణిజ్యం సాగుతుంది. ఈ సముద్రంలో అపార చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్నారు. దాదాపు ఈ సముద్రమంతా తనదేనని చైనా వాదిస్తోంది. ఇందులో తమకూ భాగముందని వియత్నాం, మలేసియా, మరికొన్ని ఆసియాన్‌ సభ్యదేశాలు పేర్కొంటున్నాయి. దీంతో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో తన మాటే నెగ్గాలని, దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యమే సాగాలని చైనా భావిస్తోంది.

మెత్తబడ్డ ఆసియాన్‌ సభ్యదేశాలు...

మెత్తబడ్డ ఆసియాన్‌ సభ్యదేశాలు...

ఆసియాన్‌లో వియత్నాం, కంబోడియా, మలేషియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, బ్రూనై, లావోస్‌, మయన్మార్‌, సింగపూర్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా పలు సభ్యదేశాలకు చైనా దౌత్య, ఆర్థిక మార్గాల ద్వారా చేరువవుతూ వాటి వైఖరి మెత్తబడేలా చేస్తోంది. శనివారం ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఒక సదస్సు సందర్భంగా ఆసియాన్‌ మంత్రులు విడుదల చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఇందులో వారు ప్రదర్శించిన మెతక వైఖరి చైనా పైచేయి సాధించడాన్ని స్పష్టం చేస్తోంది.

వ్యతిరేకించిన వియత్నాం, కంబోడియా మద్దతు

వ్యతిరేకించిన వియత్నాం, కంబోడియా మద్దతు

దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చర్చలపై చైనా విధివిధానాలకు ఆసియాన్‌ సభ్య దేశాలు ఒక ప్రకటనలో అంగీకారం తెలిపాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా, ఆసియాన్‌ సభ్యదేశాల ప్రవర్తనా నియమావళికి చట్టపరంగా కట్టుబడక్కర్లేదని చైనా చెబుతోంది. అయితే చర్చల్లో చైనా వాదనను వియత్నాం మాత్రం గట్టిగా వ్యతిరేకించింది. కానీ కంబోడియా ‘డ్రాగన్‌'కు అండగా నిలిచింది. చివరకు చైనాకు అనుకూలమైన ఫలితమే వచ్చింది.

‘ట్రైబ్యునల్‌ తీర్పును గౌరవించాలి’

‘ట్రైబ్యునల్‌ తీర్పును గౌరవించాలి’

సదస్సు సందర్భంగా మనీలాలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు సమావేశమై వివాదంపై చర్చించారు. ‘‘ఏ ప్రవర్తనా నియమావళైనా చట్టపరంగా కట్టుబడేలా, అర్థవంతంగా, ప్రభావవంతంగా ఉండాలి'' అని సంయుక్త ప్రకటనలో వారు డిమాండ్‌ చేశారు. ఆసియాన్‌ సభ్యదేశాల ప్రకటనలో ఈ డిమాండ్‌ లేదు. దక్షిణ చైనా సముద్ర వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ నిరుడు ఇచ్చిన తీర్పును చైనా, ఫిలిప్పీన్స్‌ గౌరవించాలని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా డిమాండ్‌ చేశాయి. ఈ సముద్రంపై చైనా వాదనలను చాలా వరకు ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. ఈ వివాదంలో ‘బయటివారు' తల దూర్చొద్దని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలను ఉద్దేశించి చైనా పేర్కొంటోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The United States, Japan and Australia have expressed "serious concerns" over disputes related to the South China Sea. The three countries are calling for a halt to land development and military actions in the area that could increase tensions or cause permanent environmental damage. The countries released a joint statement Monday after U.S. Secretary of State Rex Tillerson held talks with the foreign ministers of Australia and Japan. The talks took place in the Philippines, during a meeting of the Association of Southeast Asian Nations (ASEAN).The three countries called on China and the Philippines to honor an arbitration ruling made last year. The International Court of Arbitration in The Hague denied much of China's territorial claim to the South China Sea.
Please Wait while comments are loading...