సిబ్బందితో ఎఫైర్.. పదవికి రాజీనామా చేసిన మహిళా నేత
వాషింగ్టన్: అమెరికా ప్రజాప్రతినిధి క్యాతీ హిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమెపై పలు లైంగిక ఆరోపణలు రావడం హౌజ్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపడుతుండటంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కాలిఫోర్నియా నుంచి డెమొక్రటిక్ అభ్యర్థిగా కొనసాగుతున్న 32 ఏళ్ల క్యాతీ హిల్ తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేశానికి, తన నియోజకవర్గానికి, తన కమ్యూనిటీకి మంచిది కాదని చెబుతూ తను రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో పోస్టు చేసింది.
ఇదిలా ఉంటే తనకు కాంగ్రెస్‌లో పనిచేసే సిబ్బందితో సంబంధం ఉందనేది వాస్తవమేనని అయితే అతనితో ఎలాంటి శారీరక సంబంధంకానీ లైంగిక సంబంధంకానీ లేదని క్యాతీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ వ్యక్తితో పరిచయం అయ్యిందని తన ప్రచారంకు సహకరించారని చెప్పుకొచ్చింది. అయితే మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా క్యాతీని విచారణ చేస్తున్నట్లు ఎథిక్స్ కమిటీ వెల్లడించింది.

ప్రస్తుతం తాను తన భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పిన మహిళా ప్రజాప్రతినిధి, తన తప్పు ఏదైనా ఉంటే క్షమించాలని కోరారు. అదేసమయంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
తన భర్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం ఉందని చెప్పిన క్యాతీ... తన వ్యక్తిగత ఫోటోలను బహిరంగం కావడంపై ఆమె సీరియస్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంతో ఆడుకునేందుకు ఎవరికీ హక్కులేదని చెబుతూ చట్టపరంగా దీనిపై చర్యలు తీసుకుంటానని క్యాతీ చెప్పారు. ఇదిలా ఉంటే క్యాతీ హిల్ కాంగ్రెస్‌లో ఆర్మ్‌డ్ సర్వీసెస్ అండ్ రిఫార్మ్స్ కమిటీలో వైస్ ఛైర్మెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ నైట్‌పై క్యాతీహిల్ విజయం సాధించారు. క్యాతీ హిల్ గెలుపొందిన స్థానంను అక్కడి రాజకీయ విశ్లేషకులు ఎంతో ప్రాముఖ్యమైన స్థానంగా చూస్తారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications