వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: సిరియాలో అమెరికా సంకీర్ణదళాల దాడిలో సామాన్యులు మృతి, ధృవీకరించిన పెంటగాన్

ఉగ్రవాదంపై యుద్దం పేరుతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు సిరియాలో రక్తపుటేరులు పారిస్తున్నాయి. అసలు లక్ష్యాలకు దూరంగా నివాస సముదాయాలపై బాంబులు కురిపిస్తూ అమాయక ప్రజలను పొట్టనబెట్టుకొంటున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:ఉగ్రవాదంపై యుద్దం పేరుతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు సిరియాలో రక్తపుటేరులు పారిస్తున్నాయి. అసలు లక్ష్యాలకు దూరంగా నివాస సముదాయాలపై బాంబులు కురిపిస్తూ అమాయక ప్రజలను పొట్టనబెట్టుకొంటున్నాయి.

ఐసీసీ ఆధీనంలోని మయాదీ్, మోసుల్ నగరాలపై బుధ, గురువారాల్లో అమెరికా యుద్ద విమానాలు జరిపిన దాడుల్లో కనీసం 50 మంది పౌరులు ప్రాణాలనుకోల్పోయారు. సిరియా మానవహక్కుల పరిశీలన సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

US-led strikes kill 35 civilians in east Syria

వాషింగ్టన్ లోని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కేంద్రం పెంటగాన్ కూడ సిరియాలో పౌరుల మరణాలు నిజమేనని అంగీకరించడం సంచలనంగా మారింది.

అమెరికా నేతృత్వంలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ బుదవారం రక్కా నగరంపై, గురువారం నాడు మయదీన్ నగరంపై విచక్షణ రహితంగా బాంబులు కురిపించాయని, ఈ రెండు ఘటనల్లో సుమారు 50 మంది చనిపోయి ఉంటారని ఎస్ఓహెచ్ఆర్ ప్రతినిధి రమి అబ్దుల్ రహమాన్ తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ 23 నుండి మే 23 వరకు సంకీర్ణ దళాలు జరిపిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య 225 కు పెరిగింందని ఆయన వివరించాు. ఐసీసీ ఆక్రమిత సిరియా, ఇరాన్ లపై 2014 నుండి యుద్దం చేస్తోన్న అమెరికా సంకీర్ణదళాలు ఇప్పటివరకు 8వేల మందిని చంపేశాయి, వీరిలో 6 వేల మంది ఉగ్రవాదులు కాగా, మిగిలిన రెండువేల మంది సాధారణ పౌరులే కావడం గమనార్హం.

అమెరికా సంకీర్ణ దళాల దాడిలో సాధారణ పౌరులు కూడ హతమైనట్టు పెంటగాన్ అంగీకరించింది,. ఒక్క మౌసూల్ పట్టణంలోనే మార్చిలో 105 మంది సిరియన్లు చనిపోయారని యూఎస్ సెంట్రల్ కమాండ్ గురువారం నాడు ప్రకటించింది.అయితే మిగతా ప్రాంతాల్లో జరిపిన దాడులు, వాటిలో చనిపోయినవారి సంఖ్యపై పెంటగాన్ పెదవి విప్పలేదు.

English summary
US-led coalition air strikes killed at least 35 civilians in an eastern Syrian town held by ISIL, many of them women and children, a war monitor said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X