అమెరికా వీసా దరఖాస్తుదారులకు భారీ షాక్! హెచ్-1బీ, ఓపీటీ ఫీజులపై తాజా నిర్ణయం..!

అమెరికాలో (US) డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారతీయులకు ఏదో విధంగా నిత్యం షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా భారతీయులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా హెచ్-1బీ వర్క్ వీసా, ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌లపై కొత్త ఫీజుల్ని ప్రవేశపెట్టేందుకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం వైట్ హౌస్ బడ్జెట్ కార్యాలయం పరిశీలనలో ఉన్నాయి.

US Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు షాక్! తాజా రూల్స్-కీలక ప్రకటన..!
US Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు షాక్! తాజా రూల్స్-కీలక ప్రకటన..!

అమెరికా తాజా నిర్ణయం వల్ల అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయులపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో 2024 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన హెచ్-1బీ వీసాలలో దాదాపు 71 శాతం భారతీయులకే దక్కాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే ఫీజుల పెంపు నిర్ణయం నేరుగా మన ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ ఫ్రాగోమెన్ ప్రకారం, ఇప్పటికే ఈ ప్రతిపాదనల ముసాయిదా యూఎస్ బడ్జెట్ విభాగానికి చేరింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా పిటిషన్లపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించాలని ప్రయత్నించగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాంతో ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ మరో ప్రత్యామ్నాయ మార్గంలో ఫీజులు పెంచేందుకు చట్టపరమైన సన్నాహాలు చేస్తోంది.

US May Hike H-1B F-1 OPT Fees What It Means for Indian IT Workers Students
India-US Trade Deal: భారత్-యూఎస్ డీల్ పై గుడ్ న్యూస్..! అమెరికా కీలక ప్రకటన..!
India-US Trade Deal: భారత్-యూఎస్ డీల్ పై గుడ్ న్యూస్..! అమెరికా కీలక ప్రకటన..!

మరోవైపు విద్యార్థుల విషయానికి వస్తే, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేసుకునేందుకు ఉపయోగపడే ఎఫ్-1 ఓపీటీ (OPT) దరఖాస్తులపై కూడా ఈ పెరిగిన ఫీజుల ప్రభావం పడనుంది. ఈ ఫీజుల్ని కూడా భారీగా పెంచవచ్చని సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఓపీటీ దరఖాస్తుకు 470 డాలర్లు, పేపర్ రూపంలో అయితే 520 డాలర్లు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా హెచ్-1బీ వీసా రుసుములను కంపెనీలే భరిస్తాయి. కానీ ఓపీటీ ఫీజులను విద్యార్థులే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఖర్చులు భారీగా పెరిగితే భారతీయ విద్యార్థుల ఉన్నత చదువులపై, ఆ తర్వాతి ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అమెరికాలో స్థిరపడేందుకు చాలా కాలంగా ఉన్న ఎఫ్-1 నుండి హెచ్-1బీ మార్గం మరింత వ్యయభరితంగా మారనుంది. తుది నోటిఫికేషన్ వచ్చే వరకు ఫీజు ఎంత పెరుగుతుందనే దానిపై పూర్తి స్పష్టత రాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+