వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!

అమెరికా గ‌గ‌న‌త‌లంలో కలకలం రేపిన చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ ను అమెరికా ఎట్ట‌కేల‌కు కూల్చేసింది.

|
Google Oneindia TeluguNews

అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ ను అమెరికా ఎట్ట‌కేల‌కు కూల్చేసింది. అమెరికా గ‌గ‌న‌త‌లంలో ఆ బెలూన్ క‌ల‌క‌లం రేపింది. అమెరికా మిల‌ట‌రీ స్థావ‌రాల‌పై అది నిఘా పెట్టిందని గుర్తించారు. ఆ బెలూన్ ను కూల్చివేస్తే ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీని పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. మోంటానా రాష్ట్ర‌ గ‌గ‌న‌త‌లంలో కొన్ని రోజులుగా ఉన్న చైనా 'స్పై బెలూన్‌' పై మిసైల్ ప్రయోగించిన అమెరికా అట్లాంటిక్ సముద్రంలో కూల్చేసింది. తమ సైనిక స్థావరాలపైన నిఘా కోసమే చైనా ఈ స్పై బెలూన్ ను ప్రయోగించిందని అమెరికా భావిస్తోంది. బెలూన్ ను కూల్చివేసిన విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది.

తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్‌లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్‌ను కూల్చివేశాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. అమెరికా పేల్చివేతతో బెలూన్ లోని పరకరాల విజువల్స్ ప్రస్తుతం వీడియోల్లో కనిపిస్తున్నాయి, బెలూన్ లోని పరికరాలు సముద్రంలో 11 కిలోమీటర్ల మేర పడ్డాయి. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు ఓడలు భారీ క్రేన్ తో వాటిని స్వాధీనం సేకరిస్తున్నాయి. అమెరికా గగన తలంలో ఈ బెలూన్ ను గుర్తించిన సమయం నుంచి కూల్చివేయాలంటూ బైడెన్ పైన ఒత్తిడి వచ్చింది. చివరకు ఎఫ్-22 మిలటరీ జెట్ నుంచి ఏఐఎం-9ఎక్స్ సైడ్ వైండర్ క్షిపణిని ప్రయోగించి ఈ బెలూన్‌ను కూల్చివేసినట్లు రక్షణ అధికారులు వెల్లడించారు. దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్ నుంచి 6 నాటికల్ మైళ్ల దూరంలో 47 అడుగుల లోతున్న సముద్రంలో ఇది పడిందని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

US military fighter aircraft shot down a suspected Chinese spy balloon

బెలూన్ కూల్చివేత..సముద్రంలో పడిన దృశ్యాలు అమెరికా టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బెలూన్ కూల్చివేత విజయవంతంగా పూర్తి చేయటం పైన వైమానిక దళ సిబ్బందిని అధ్యక్షుడు బైడెన్ అభినందించారు. ఇదే సమయంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 'తమ దేశానికి చెందిన ఈ బెలూన్(ఎయిర్‌షిప్) గతి తప్పి ప్రమాదవశాత్తు అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది, ఈ విషయం గుర్తించినప్పటి నుంచి అమెరికాకు అనేకమార్లు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చింది. ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి చైనాలో పర్యటించాల్సి ఉండగా.. బెలూన్ విషయంలో చైనా బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. అది గూఢచర్య బెలూన్ కాదని.. వాతావరణ పరిశోధనకు ఉద్దేశించిందని వివరించే ప్రయత్నం చేస్తోంది.

English summary
US military fighter aircraft shot down a suspected Chinese spy balloon as it floated off the coast of South Carolina
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X