ప్రియుడితో అభ్యంతరకర ఫోటో: కూతుర్ని కొడుతూ ఫేస్‌బుక్‌లో 'లైవ్'

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టిన పదహారేళ్ల కూతురు పైన తల్లి చితకబాదిన సంఘటన అమెరికాలోని జార్జియాలో చోటు చేసుకుంది. అంతేకాదు, దీనిని ఆ తల్లి లైవ్ వీడియో తీయించి, తన కుమార్తె ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ అవుతోందిత. షనవియా మిల్లర్ అనే మహిళ తన కూతురును కట్టె తీసుకొని దారుణంగా చితకబాదింది. తర్వాత చేతులతో కొట్టింది.

ఆ కూతురు తన బాయ్‌ఫ్రెండుతో కలిసి ఉన్న అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. విషయం తెలుసుకున్న తల్లికి కోపం వచ్చింది. కూతురు చేతిలోని సెల్ ఫోన్ లాక్కొని, అక్కడే ఉన్న మరొకరిని తాను చేసే దానిని వీడియో తీయమని చెప్పింది.

US mother thrashes daughter on Facebook Live for posting provocative photos

అనంతరం కూతురు పైన తన ప్రతాపం చూపించింది. తల్లి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ కూతురు ఓ మూలకు వెళ్లి దాక్కుంది. అక్కడకు వెళ్లి కూడా ఆమె చితకబాదింది.

కూతురు పైన చేయి చేసుకోవడాన్ని ఆమె సమర్థించుకుంది. తన కూతురు అంటే తనకు ఇష్టమని, ఆమె తలకొట్టేసే పనులు చేయవద్దనే తాను మందలించానని చెప్పింది. తన తల్లి బాధను అర్థం చేసుకున్నానని ఆమె కూతురు కూడా చెప్పింది. అయితే, మిల్లర్ చర్య పైన నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US mother thrashes daughter on Facebook Live for posting provocative photos.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి