వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా?

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: పశ్చిమ హిందూ మహా సముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపమైన రీయూనియన్ ద్వీపం తీర ప్రాంతానికి కొన్ని విమాన శిథిలాలు కొట్టుకొచ్చాయి. ఆ శిథిలాలు నిరుడు అదృశ్యమైన ఎమ్‌హెచ్ 370 మలేషియన్ విమానానికి సంబంధించినవిగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా? లేక వేరేవా? అనే విషయం తేల్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సంగతి తేల్చడానికి ఓ బృందాన్ని పంపామని మలేషియా రవాణా శాఖా మంత్రి ఎల్‌టీ లై చెప్పారు.

ఈ బృందం దర్యాప్తు జరిపి ఆ శకలాలు అదృశ్యమైన ఎమ్‌హెచ్ 370కి చెందినవా లేదా కూలిన ఎమ్‌హెచ్ 17వా గుర్తించి నివేదిక త్వరలోనే ఇస్తుందన్నారు. రీయూనియన్ ద్వీప స్థానికులు రెండు మీటర్ల వెడల్పు గల విమానం రెక్కను కనుగొన్నారు. అది అదృశ్యమైన ఎమ్‌హెచ్ 370 విమానానికి చెందినవే అని వారు అంటున్నారు.

నిరుడు మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఎమ్‌హెచ్ 370 విమానం 40 నిమిషాలకే జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. పలు దేశాలు గాలింపు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. ఆ విమానంలో 239 ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

English summary
Air safety investigators have a "high degree of confidence" that aircraft debris found in the Indian Ocean is of a wing component unique to the Boeing 777, the same model as the Malaysia Airlines plane that disappeared last year, a US official has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X