వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్, నేను కలిస్తే వారు జీర్ణించుకోలేకపోతున్నారు: ట్రంప్ విమర్శలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో తన భేటీపై విమర్శలు రావడం మీద అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తమ ప్రెస్ కాన్ఫరెన్సును చాలామంది మేధావులు ఇష్టపడ్డారని, అంతకుముందు జరిగిన భేటీలో పుతిన్‌తో ఎన్నో కీలక విషయాలను చర్చించానని తెలిపారు.

తాము కలవడం చూసి చాలామంది జీర్ణించుకోలేకపోయారని, వారు తమ ఇద్దరి మధ్య బాక్సింగ్‌ మ్యాచ్‌ను చూడాలనుకున్నారని, తమ భేటీ త్వరలో మంచి ఫలితాన్ని ఇవ్వనుందని తెలిపారు. నాటో మీటింగ్‌ కూడా విజయవంతమైందని, సభ్యదేశాలు వేగంగా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించనున్నాయన్నారు.

పుతిన్‌తో సమావేశం విజయవంతమైనా దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇస్తుందని, ఈ సమావేశంలో ఎన్నో సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఉత్తర కొరియా విషయంలో సాయం చేయడానికి రష్యా అంగీకరించిందని, మనతో వారి సంబంధాలు మెరుగు పడుతున్నాయన్నారు.

 US president defends meeting and press conference with Putin

ప్రయత్నాలు కొనసాగుతాయని, తొందర ఏమీ లేదన్నారు. ఆంక్షలు కూడా కొనసాగుతాయని, శాంతి ప్రక్రియ చివర్లో ఉత్తర కొరియాకు మంచి లాభం, బంగారు భవిష్యత్తు లభిస్తుందని చెప్పారు.

కాగా, పుతిన్‌తో సోమవారం ట్రంప్‌ భేటీ అయ్యారు. వీరి భేటీకి ఫిన్‌లాండ్‌లోని హెల్సిన్కిలోని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ వేదికైంది. ఈ భేటీ అనంతరం అమెరికా మీడియా ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. చివరికి సొంతపార్టీ వారు కూడా ట్రంప్‌పై మండిపడ్డారు.

English summary
US President Donald Trump has defended his meeting with Russian President Vladimir Putin, amid a backlash over his performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X