భారత్- పాక్ మధ్య యుద్ధాన్నే ఆపా: నా ముందు మీరెంత.. జుజూబీ

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాకిస్తాన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ట్రేడ్ డీలింగ్ ద్వారా ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలిపివేశానని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఆయన స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు.

తాజాగా ఆయన థాయ్‌లాండ్, కాంబోడియా యుద్ధాన్ని ఆపిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలను తానే నివారించానని చెప్పారు. తాను జోక్యం చేసుకున్న తర్వాత ఈ రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని, చర్చలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశాయని తెలిపారు.

US President Donald Trump uses trade leverage for Cambodia-Thailand Ceasefire

థాయ్ లాండ్- కాంబోడియా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నాయని, ఆసియా రీజియన్ లో గానీ అంతర్జాతీయంగా గానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ పై పోస్ట్ చేశారు.

కాంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్, థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్థమ్ వెచాయాచైలతో విడివిడిగా మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఘర్షణలను కొనసాగించితే.. తమతో కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇది భారత్- పాకిస్తాన్ యుద్ధం, తన జోక్యంతో ఈ రెండు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించిన సందర్భాన్ని గుర్తు చేసిందని పేర్కొన్నారు.

తాను మాట్లాడిన తరువాత థాయ్ లాండ్- కాంబోడియా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ రెండు దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలు ట్రేడింగ్ టేబుల్ వద్దకు తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో మే నెలలో ఒక కాంబోడియన్ సైనికుడు మరణించడంతో ఇరు దేశాలు బలగాలను మోహరించాయి. శనివారం థాయ్‌ లాండ్‌లోని ట్రాట్ ప్రావిన్స్, కాంబోడియాలోని పుర్సాట్ ప్రావిన్స్‌లలో దాడులు తీవ్రం అయ్యాయి.

శనివారం నాటికి థాయ్‌లాండ్ 20 మంది మరణించినట్లు ప్రకటించింది, కాంబోడియా 13 మంది మరణించినట్లు తెలిపింది. థాయ్‌లాండ్ చట్టవిరుద్ధంగా దురాక్రమణకు పాల్పడుతోందని, సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనికులను మోహరిస్తోందని, ఉద్రిక్తతలకు కారణమౌతోందనేది కాంబోడియా ఆరోపణ.

దీన్ని థాయ్ లాండ్ తోసిపుచ్చింది. కాంబోడియాతో శాంతిని కోరుకుంటోన్నామని, ద్వైపాక్షిక పరిష్కారానికి మొగ్గు చూపుతున్నట్లు వివరించింది. కాంబోడియా సరిహద్దు దాడికి పాల్పడుతోందని, తమ భూభాగంపైకి చొచ్చుకుని వస్తోందని, ల్యాండ్ మైన్లను అమర్చుతోందని థాయ్ లాండ్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+