వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా, రష్యాలకు అమెరికా గిఫ్ట్‌గా: కళ్లు తిరిగే బడ్జెట్: పోతూ పోతూ ట్రంప్ వీటో అస్త్రం: ఫస్ట్ టైమ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వీటో అస్త్రాన్ని ప్రయోగించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రక్షణ బడ్జెట్ ప్రతిపాదనలు, బిల్లును వీటో చేశారు. వాటిని ఆమోదించలేదు. వెనక్కి పంపించారు. ఈ బడ్జెట్ విలువ.. 740 బిలియన్ డాలర్లు. అమెరికా రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లుగా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా, చైనాలకు బహుమతి ఇస్తున్నట్లు తయారు చేశారని మండిపడ్డారు. ఇలాంటి బలహీన బిల్లు దేశాన్ని కాపాడలేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని గిఫ్ట్: ప్రతిష్ఠాత్మక మిలటరీ అవార్డ్: గుర్తుగాప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని గిఫ్ట్: ప్రతిష్ఠాత్మక మిలటరీ అవార్డ్: గుర్తుగా

తన నాలుగేళ్ల పదవీ కాలంలో డొనాల్డ్ ట్రంంప్.. వీటో అధికారాన్ని వినియోగించడం ఇదే తొలిసారి. చివరిసారి కూడా కావచ్చు. ఇప్పటిదాకా ఆయన వీటో అధికారాన్ని వినియోగించలేదు. ఈ సారి డిఫెన్స్ బడ్జెట్ విషయంలో వీటో అస్త్రాన్ని వినియోగించారు. యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన రక్షణ బిల్లుపై సంతకం చేయలేదు. దాన్ని ఆమోదించలేదు. సెనెట్‌లో 84-13, హౌస్‌లో 355-78 ఓట్ల తేడాతో రక్షణ బిల్లు, 740 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. తనకు ఉన్న వీటో అధికారం ద్వారా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తిప్పి పంపించారు.

US President Donald Trump on Wednesday vetoed massive annual defense policy bill

అమెరికా రక్షణ వ్యవహారాలు, జాతీయ భద్రత, ఉద్యోగులు, మిలటరీ అధికారులు, సైనికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు కనిపించట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో కొన్ని కీలక లోపాలు ఉన్నాయని, వాటిని యధాతథంగా ఆమోదించడం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపే విషయంలో రక్షణ, విదేశాంగ విధానాలు, వాటికి సంబంధించిన బిల్లులే కీలక పాత్ర పోషిస్తాయని, అలాంటి బిల్లులు, బడ్జెట్‌ను రూపొందించే సమయంలో అజాగ్రత్తగా ఉండకూడదని ట్రంప్ అన్నారు.

యూఎస్ కమ్యూనికేషన్స్ డీసెన్సీ యాక్ట్-1996లోని సెక్షన్ 230ని యూఎస్ కాంగ్రెస్ రద్దు చేయకపోవడంపైనా డొనాల్డ్ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ కొన్ని సోషల్ మీడియా కంపెనీల యాజమాన్యానికి రక్షణ కల్పిస్తోందని, యూజర్లు, నెటిజన్లకు ఉపయోగం లేకుండా పోతోందని ట్రంప్ భావిస్తున్నారు. సెక్షన్ 230ని రద్దు చేయకపోవడం వల్ల మున్ముందు.. పాలనాపరమైన అడ్డంకులు ఏర్పడవచ్చని, అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సవాళ్లు విసిరే ప్రమాదం లేకపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
US President Donald Trump on Wednesday vetoed massive annual defense policy bill, saying it fails to include critical national security measures and is a gift to Russia and China. United States military’s 740 billion dollars annual budget setting up a confrontation with Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X