భారత్-పాక్ యుద్ధాన్ని అలా వాడేసుకున్న చైనా? షాకింగ్ యూఎస్ రిపోర్ట్..!
ఈ ఏడాది వేసవిలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారానికి భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తొలుత ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ ఆ తర్వాత పాక్ ఆయుధ వ్యవస్థల్నీ కుప్పకూల్చింది. దీంతో పాకిస్తాన్ కూడా ప్రతీకారానికి దిగింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చైనాతో పాటు టర్కీ నుంచి తెచ్చుకున్న ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్ భారత్ పై ప్రయోగించింది. దీనికి భారత్ కూడా దీటుగానే బదులిచ్చింది. దీంతో అమెరికా జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు ఇరుదేశాల్నీ ఒప్పించింది.
అయితే భారత్-పాక్ మధ్య జరిగిన యుద్దంలో చైనా పోషించిన పాత్రపై అమెరికా గట్టిగానే నిఘా పెట్టింది. దీనికి సంబంధించిన వివరాల్ని అమెరికా కాంగ్రెస్ కమిటీ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో బారత్-పాక్ యుద్దాన్ని చైనా ఎలా వాడుకుందో వివరించింది. భారత పై పాకిస్తాన్ యుద్ధానికి తమ కొత్త ఆయుధాలు ఇచ్చిన చైనా.. ఈ పోరును ఓ ప్రయోగశాల (ల్యాబ్)లా వాడుకుందని అమెరికా కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది.

భారత్-పాక్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ముఖాముఖీ పోరును చైనా ప్రత్యక్ష పరీక్ష స్థలంగా పరిగణించినట్లు అమెరికా రిపోర్ట్ లో తెలిపింది. ఈ పోరులో చైనా ప్రత్యక్షంగా యుద్దంలో దిగకుండా తన తాజా ఆయుధ వ్యవస్థల పరిధి, పనితీరు పరీక్షించేందుకు ఉపయోగించుకుందని అమెరికా-చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ పేర్కొంది. భారత్ తో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, చైనా తమ రక్షణ పరిశ్రమ లక్ష్యాల సాధనకు ఉపయోగపడే ఆయుధాల సత్తాను పరీక్షించడానికి అవకాశవాదంగా ఈ సంఘర్షణను ఉపయోగించుకుందని నివేదిక పేర్కొంది.

చైనా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలైన HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ, PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, J-10 ఫైటర్ జెట్‌లు ప్రత్యక్ష యుద్దంలో మోహరించడం ఇదే తొలిసారి అని, ఇది బీజింగ్‌కు డేటా, ప్రచారాన్ని ఇచ్చిందని ఈ నివేదిక తెలిపింది. ఇది వాస్తవ ప్రపంచ క్షేత్ర ప్రయోగంగా పనిచేస్తుందని తెలిపింది. జూన్ లో పాకిస్తాన్‌కు 40 J-35 ఐదవ తరం ఫైటర్ జెట్‌లు, KJ-500 విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి చైనా ఆఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది.
-
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications