తాలిబన్లకు యూఎస్ మరో షాక్ .. ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధాల విక్రయాలు నిలిపివేస్తూ జో బైడెన్ నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ ను రెండు దశాబ్దాలపాటు తాలిబన్ల పాలనలో నుండి విముక్తులను చేసిన యూఎస్ దళాలను ఇటీవల ఉపసంహరించుకోవడంతో ఊహించని విధంగా ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఆందోళన కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ బాధ్యత తమది కాదని, మోయలేని ఆర్థిక భారంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను కాపాడవలసిన అవసరం తమకు లేదని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా తాలిబన్లకు మరో షాక్ ఇచ్చారు.

తాలిబన్లకు ఆయుధాల విక్రయాలను నిలిపివేసిన యూఎస్
బైడెన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ కు అన్ని ఆయుధాల విక్రయాలను నిలిపివేసింది. తాలిబాన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న మూడు రోజుల తర్వాత ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ నిర్ణయం తీసుకుంది. రక్షణ కాంట్రాక్టర్లకు నోటీసులో, యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో ఆఫ్ఘనిస్థాన్ కు పెండింగ్‌లో ఉన్న లేదా పంపిణీ చేయని ఆయుధాల బదిలీలు ప్రస్తుతానికి సమీక్షలో ఉంచమని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులను అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అమెరికన్ బ్యాంకులలో ఆఫ్ఘన్ ఖాతాలు నిలిపివేత
ఆఫ్ఘనిస్థాన్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రపంచ శాంతి, జాతీయ భద్రత మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో వారి అనుకూలతను నిర్ణయించడానికి పెండింగ్‌లో ఉన్న మరియు ఎగుమతి లైసెన్స్‌లు మరియు ఇతర ఆమోదాలను డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తున్నదని తెలిపారు. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమెరికన్ బ్యాంకులలో ఆ దేశానికి చెందిన ఖాతాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇచ్చారు .

ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆఫ్ఘన్ లోని అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
ఆఫ్ఘనిస్తాన్ కు ఆయుధాల అమ్మకాన్ని నిలిపివేయాలని జో బైడెన్ నిర్ణయించారు. రాబోయే రోజుల్లో యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ రక్షణ పరికరాల ఎగుమతిదారుల కోసం మళ్లీ సవరించిన ఆదేశాలను జారీ చేస్తుందని యూఎస్ పేర్కొంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వశపరచుకున్న అనంతరం అమెరికాకు చెందిన బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అమెరికా తాలిబన్లు తమ లో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అంటూ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది. ఇందులోభాగంగానే ఆయుధాల అమ్మకాన్ని నిలిపివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది

గత 20 ఏళ్లలో 227 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించిన యూఎస్
తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆయుధ సామాగ్రిలో బ్లాక్-హాక్ హెలికాప్టర్లు, A-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు మైన్-రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు US- తయారు చేసిన M4 కార్బైన్‌లు మరియు M16 రైఫిల్స్ ఉన్నాయి. ఉన్నాయి. గత 20 ఏళ్లలో 227 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించినట్లుగా తెలుస్తోంది. అష్రఫ్ ఘని పరిపాలన పతనం సమయంలో తాలిబాన్లు బిలియన్ల విలువచేసే యుఎస్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని కోపంగా ఉన్న అమెరికా ఈ క్రమంలోనే ఆయుధాల సరఫరా నిలిపివేసి నిర్ణయం తీసుకుంది.
Recommended Video

గత ఐదేళ్ళలో గణనీయంగా ఆయుధాలను సరఫరా చేసిన యూఎస్
స్వీడన్ ఆధారిత స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) సేకరించిన డేటా ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో యుఎస్ తన ప్రపంచ ఆయుధ ఎగుమతుల వాటాను 37 శాతానికి పెంచింది. అదే డేటా యుఎస్, ఫ్రాన్స్ మరియు జర్మనీల ద్వారా పెరిగిన ఎగుమతులు రష్యా మరియు చైనా ఆయుధాల ఎగుమతులు క్షీణించడంతో భర్తీ చేయబడ్డాయని వెల్లడించింది .
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications