అమెరికాలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

స్థానికులు ఆ ప్రాంతంలో సంచరించొద్దని అధికారులు హెచ్చరించారు. 'ఇకపై ఎలాంటి భయం ఉండదనే మేం అనుకుంటున్నాం' అని స్థానిక అధికారి ఒకరు ట్వీట్ చేశారు.
కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన కొన్ని నిమిషాల్లోనే ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని బయటకు విడుదల చేయలేదు. ఆ కాల్పుల వెనకున్న కారణాలు తెలియాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications