రికార్డు: పారాచూట్ లేకుండా 25వేల అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

కాలిఫోర్నియా: పారాచూట్ లేకుండా 25 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసి రికార్డు సృష్టించాడు. ఈ అధ్బుతమైన విన్యాసం శనివారం కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఈ అద్భుత విన్యాసాన్ని చూసిన వారందరి గుండెలు కాసేపు ఆగిపోయాయి. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన లూక్‌ ఐకిన్స్‌ (42) అనే స్కై డైవర్‌ ఈ అద్భుతమైన విన్యాసాన్ని చేసి చూపాడు.

అమెరికాలోని సిమీ వ్యాలీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈ విన్యాసం చేశాడు. ఇప్పటికే 18వందల జంప్‌లు పూర్తిచేసిన ల్యూక్ ఐకిన్స్ హెలికాప్టర్ నుంచి దూకి ఈ లక్ష్యాన్ని చేధించాడు. 26 ఏళ్లుగా ఇదే కెరీర్‌లో ఉన్న ఐకిన్స్ పారాచూట్ లేకుండా 25వేల అడుగుల ఎత్తునుంచి దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు


ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం అతడు పారాచూట్‌ను ధరించేందుకు ఒప్పుకొన్నాడు. అయితే హెలికాప్టర్ 7.6 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత లూక్‌, అతడి బృందం దూకేందుకు సిద్ధమయ్యారు. లూక్‌ భార్య, కొడుకు లోగన(4), ప్రేక్షకులు చూస్తుండగా లూక్‌ బృందం కిందకి దూకేసింది.

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు


తీరా చూస్తే లూక్ పారాచూట్ లేకుండానే దూకేశాడు. కాగా మిలిగిన వారంతా పారాచూట్ ధరించారు. మొత్తం రెండు నిమిషాల పాటు సాగిన ఐకిన్స్ ప్రయాణంలో గంటకు 193 కిలోమీటర్ల వేగంతో కింద ఏర్పాటు చేసిన 100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉన్న వలలో సురక్షితంగా పడ్డాడు.

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు


ఈ అద్భుత విన్యాసాన్ని చూస్తున్న వారందరూ అతడు నేరుగా వచ్చిన వలలో పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కిందికి దిగి ఉద్వేగంతో తన భార్యను ఆలింగనం చేసుకున్నాడు.

 పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు

పారాచూట్ లేకుండా 25వేల ఎత్తు నుంచి దూకేశాడు

అనంతరం లూక్ మాట్లాడుతూ ఈ ఘనత సాధించేందుకు రెండేళ్లు కఠిన శిక్షణ తీసుకున్నానని, ఈ విజయాన్ని వర్ణించేందుకు తన వద్ద మాటలు లేవని లూక్‌ తెలిపాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mr Aikins - who has more than 18,000 jumps under his belt - fell dead centre into the 100x100ft net in Simi Valley, southern California.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X