దేవయాని ఇష్యూ: మెత్తబడినా క్షమాపణకు నో

వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే విషయంలో అమెరికా కాస్తా మెతకబడినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి గానీ కేసులను ఉపసంహరించుకోవడానికి గానీ ముందుకు రావడం లేదు. ఈ విషయంలో భారతదేశం డిమాండ్లను అమెరికా తోసిపుచ్చింది. దేవయానిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆమెను విచారించకుండా వదిలేసే ప్రసక్తి లేదని అమెరికా శుక్రవారంనాడు స్పష్టం చేసింది.

భారతదేశంతో ఏర్పడిన వివాదాన్ని ప్రస్తావించకుండానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వార్షిక సెలవులను గడపడానికి హవాయ్ వెళ్లిపోయారు. మీడియాతో భారతదేశంతో ఏర్పడిన వివాదాన్ని ప్రస్తావించలేదు. దాన్నిబట్టి, ఆ అంశం తన ఎజెండాలో లేదని ఆయన చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది.

devyani khobragade

అయితే, ఇరు దేశాలు మాత్రం దౌత్యపరమైన సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఈ చర్చలు సాగుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను ప్రస్తావించగా, ఇరు దేశాల మధ్య సంబంధాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది దౌత్యపరమైన సంబంధాలకు మాత్రమే సంబంధించింది కాని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకీ అన్నారు.

దేవయాని వివాదంపై దౌత్యపరమైన సంభాషణల ద్వారా, ప్రైవేట్ సంభాషణల ద్వారా చర్చిస్తామని చెప్పారు. వీసా ఫ్రాడ్‌కు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించగా ఇది న్యాయపరమైన కేసు అని, అది తమ విదేశాంగ శాఖ పరిధిలో లేదని సాకి అన్నారు. తమ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంట్, భారత ప్రభుత్వం విషయంపై, ఆరోపణలపై భిన్నమైన అన్వయాలను చూపిస్తున్నాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+