వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియాకు ఝలక్.. ‘థాడ్’వాహనంతో రంగంలోకి అమెరికా.. చైనా ఆందోళన

ఉత్తర కొరియా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అత్యంత ఆధునిక థాడ్ ( టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) క్షిపణి విధ్వంసక వాహనాన్ని దక్షిణ కొరియాకు పంపించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సియోల్: ఉత్తర కొరియా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా రంగంలోకి దిగింది. పదే పదే క్షిపణి ప్రయోగాలతో బెదిరింపులకు దిగుతున్న ఉత్తర కొరియాకు ఝలక్ ఇచ్చేందుకు అమెరికాకు చెందిన అత్యంత ఆధునిక థాడ్ ( టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) క్షిపణి విధ్వంసక వాహనాన్ని దక్షిణ కొరియాకు పంపించింది.

అమెరికా పంపించిన ఈ థాడ్ క్షిపణి విధ్వంసక వాహనం సోమవారం రాత్రి ఒసాన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కూడా ఉత్తర కొరియా నాలుగు ఖండాంతర క్షిపణులను జపాన్ దిశగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.

ఉత్తర కొరియాకు చెక్...

ఉత్తర కొరియాకు చెక్...

అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో కవ్వంపు చర్యలకు దిగుతున్న ఉత్తర కొరియాకు చెక్ పెట్టేందుకు గత ఏడాది జూలైలోనే అమెరికా ఈ థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాలో అమర్చాలని భావించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవస్థ ఏర్పాటుకు పచ్చజెండా కూడా ఉపారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.

అత్యాధునిక క్షిపణి విధ్వంసక వ్యవస్థ...

అత్యాధునిక క్షిపణి విధ్వంసక వ్యవస్థ...

తూర్పు ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను అమెరికా థాడ్ క్షిపణి విధ్వంసక వాహనం సమర్థంగా ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. ఈ థాడ్ క్షిపణి విధ్వంసక వాహనం ఇప్పుడు అమెరికా ఆర్మీ వద్ద ఉన్న అత్యాధునిక మిస్సైల్ మెషిన్.

ముందుగానే పసిగడతాయి...

ముందుగానే పసిగడతాయి...

శత్రువులు ప్రయోగించిన క్షిపణులను థాడ్ వ్యవస్థలోని రాడార్లు ముందుగా పసిగడతాయి. ఆ తరువాత ముందుకు దూసుకొస్తున్న క్షిపణిని ధ్వంసం చేసేందుకు ఈ వ్యవస్థకు చెందిన మరో వాహనంపైన ఉన్న లాంచర్ నుంచి క్షిపణి విధ్వంసక ఆయుధాన్ని ప్రయోగిస్తారు. దీంతో శత్రు దేశం క్షిపణి ధ్వంసం అవుతుంది.

చైనాకు ముప్పే...

చైనాకు ముప్పే...

ఇప్పుడు యుద్ధ రంగంలో థాడ్ వ్యవస్థనే అత్యంత ఖరీదైన, పటిష్టమైన వ్యవస్థగా భావిస్తున్నారు. మిలిటరీ హార్డ్ వేర్ లో థాడ్ క్షిపణి వ్యవస్థకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఇలాంటి అత్యాధునిక వ్యవస్థను దక్షిణ కొరియాలో అమర్చడాన్ని ఆసియా ఖండంలోని మరో అగ్రరాజ్యం చైనా వ్యతిరేకిస్తోంది.

పరిస్థితి మరింత ఉద్రిక్తం...

పరిస్థితి మరింత ఉద్రిక్తం...

ఇప్పటికే కొరియా దీవుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ థాడ్ మిస్సైల్ మెషిన్ రావడం వల్ల ఉత్తర కొరియా మళ్లీ కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నాలు చేపట్టే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తమ సరిహద్దు సమీపంలో ఈ థాడ్ వ్యవస్థ ఏర్పాటును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే చైనా దీవుల అంశంలో రెండు అగ్రదేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ థాడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారే ప్రమాదం ఏర్పడింది.

English summary
The United States started to deploy the first elements of its advanced anti-missile defense system in South Korea on Tuesday after North Korea's test of four ballistic missiles, U.S. Pacific Command said, despite angry opposition from China. The announcement came as North Korean state media said leader Kim Jong Un had personally supervised Monday's missile launches by an army unit that is positioned to strike U.S. bases in Japan, stepping up threats against Washington as U.S. troops conduct joint military exercises with South Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X