వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులకు ట్రంప్ భారీ షాక్: హెచ్-1వీసాల సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆరు నెలల వరకు తాత్కాలిక రద్దు ఉండొచ్చని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. ఏప్రిల్‌ 3 నుంచి హెచ్‌1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు అమల్లోకి రానుంది.

పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్‌ హెచ్‌-1బీ వీసాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఫీజుతో హెచ్‌-1బీ వీసాల ప్రాసెస్‌ త్వరగా పూర్తిచేసుకునే 'ప్రీమియం ప్రాసెసింగ్‌'కు మాత్రమే ఈ తాత్కాలిక రద్దు వర్తిస్తుంది. అదనంగా 1,225డాలర్లు చెల్లిస్తే ప్రీమియం ప్రాసెసింగ్‌కు అవకాశం ఉండేది. ప్రస్తుతం దీన్ని రద్దు చేశారు. రెగ్యులర్‌ హెచ్‌-1బీ వీసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

US suspends premium processing of H1 B petitions

యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన మీడియా ప్రకటన ప్రకారం.. ప్రస్తుత తాత్కాలిక వీసాల నిలిపివేత హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించేస్తుంది. ప్రీమియం ప్రాసెసింగ్‌కు 15 రోజుల సమయం పడుతుండగా, రెగ్యులర్‌ హెచ్‌-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు మూడు నెలలకు పైగా పడుతోంది.

ప్రీమియం ప్రాసెసింగ్‌ దరఖాస్తుల వల్ల రెగ్యులర్‌ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సమయం బాగా పెరిగిపోతోందని అందుకే వాటిపై తాత్కాలిక రద్దు అమలు చేస్తున్నామని వెల్లడించింది.భారీ సంఖ్యలు దరఖాస్తులు రావడంతో వాటిని తక్కువ సమయంలో ప్రాసెసింగ్ చేయడం కష్టసాధ్యమవుతోందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి నైపుణ్యంగల వారికి ఇచ్చే తాత్కాలిక వర్క్‌ వీసా హెచ్‌-1బీని ఎక్కువగా భారత ఐటీ ఇంజనీర్లు ఉపయోగించకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, తాజా నిర్ణయంతో భారతదేశ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేగాక, నాన్ ఇమ్మిగ్రేంట్ వీసాలు పొందిన భారతీయులు అమెరికాలో 70శాతం వరకు ఉండటం గమనార్హం.

English summary
This is bad news for the Indian IT industry. The United States Citizenship and Immigration Services on Friday announced that it will temporarily suspend its premium processing for all H1-B petitions from April 3 onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X