వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన అమెరికా, భద్రతా సహకారం నిలిపివేత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా వరుస షాకులు ఇస్తోంది. రూ.115 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. అంతకుముందు, అమెరికా పాక్‌కు సైనిక సాయాన్ని నిలిపివేసింది. ఇప్పుడు భద్రతా సహకారాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోందని, ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా పాకిస్తాన్‌పై గుర్రుగా ఉంది. ఈ కారణంగా పాక్‌కు 1.15 బిలియన్‌ డాలర్ల సహకారాన్ని నిలిపేస్తున్నట్లు తెలిపింది.

US suspends security assistance to Pakistan

గత పదిహేనేళ్లుగా పాక్‌కు ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తుంటే వాళ్లు తమను మోసం చేస్తున్నారని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 255 మిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపివేశారు. తాజాగా అక్కడి రక్షణ విభాగం 900 మిలియన్‌ డాలర్ల భద్రత సహకారాన్ని కూడా నిలిపేసింది. రెండూ కలిపి మొత్తం 1.15బిలియన్‌ డాలర్ల సహాయాన్ని అమెరికా ఆపేసింది.

పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆఫ్గాన్‌ తాలిబన్లు, హక్కాని నెట్‌వర్క్‌ తదితర ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకునేంత వరకు పాక్‌కు ఆర్థిక, భద్రత సహకారాలు నిలిపేస్తామని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి హీతర్‌ వెల్లడించారు.

English summary
The United States has announced it will suspend security assistance to Pakistan for failing to take "decisive action" against Taliban militants targeting US personnel in neighbouring Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X