భారత్ కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్న ట్రంప్..! త్వరలో కీలక ప్రకటన..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మిగతా దేశాలతో పాటు భారత్ పైనా ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా కాస్త మెత్తబడ్డారు. ముఖ్యంగా అమెరికా మాట విని పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల మధ్య భారత ప్రధాని మోడీతో ఫోన్ లో చర్చలు కూడా జరిపిన మోడీ.. ఇప్పుడు మన దేశం విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు. దీని ప్రభావంతో భారత్-అమెరికా మధ్య ఓ మినీ వాణిజ్య ఒప్పందం కూడా కుదరబోతోంది.

భారత్-అమెరికా మధ్య త్వరలో చేసుకునే మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా మన దేశంపై 20 శాతం కంటే తక్కువ పన్నులు విధించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు మరింత అనుకూలమైన స్థానం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వారంలో భారత్ కు పంపాలని ట్రంప్ భావించిన సుంకాల పెంపు నోటీసు అందడం లేదని తెలిస్తోంది.

US to levy below 20 percent tariffs on india- here is big update

భారత్ తో కుదుర్చుకునే ఒప్పందంపై ట్రంప్ స్వయంగా ఓ ప్రకటన చేస్తారని బ్లూమ్ బర్గ్ టీవీ కథనం తెలిపింది. ఇతర దేశాలపై సుంకాల మోత మోగించబోతున్న ట్రంప్... భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించింది. భారత్-అమెరికా మధ్య ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగింపు కోసం అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ఈ ఏడాది చివర్లో అసలు ఒప్పందం కుదిరే వరకు భారత్‌కు పరిష్కారం కాని ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా సమయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

US to levy below 20 percent tariffs on india- here is big update

ప్రస్తుతం కుదరబోయే మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో 20 శాతం కంటే తక్కువ సుంకాలు ఖరారైతే దీని ప్రభావంతో ఈ ఏడాది చివర్లో చేసుకునే అసలు ఒప్పందంలోనూ మరింత వెసులుబాటు లభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ మినహా ఇతర దేశాలపై గరిష్టంగా 50 శాతం వరకూ పన్నులు విధిస్తూ ట్రంప్ ఆయా దేశాలకు లేఖలు కూడా రాస్తున్నారు. ఆగస్టు 1తో ఇవి అమల్లోకి రానున్నాయి. భారత్ వంటి ప్రత్యేక సుంకాల రేట్లు అందని దేశాలపై 15 నుంచి 20 శాతం సుంకాలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+