భారత శత్రుదేశాలకు బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా..!
జమ్మూ కాశ్మీర్ భూభాగం భారత్ లో అంతర్భాగంగా ఉంది. అయితే పాకిస్థాన్ మాత్రం జమ్మూకాశ్మీర్ తమదేనంటూ వాదనలు చేస్తోంది. సరిహద్దుల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న క్రమంలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే తాజాగా పాకిస్థాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా తాజాగా భారత్ మ్యాప్ ను అమెరికా విడుదల చేసింది. అయితే ఆ మ్యాప్ లో జమ్మూకాశ్మీర్ మొత్తం భూ భాగాన్ని భారత్ లో అంతర్భాగంగానే అమెరికా చూపించింది. దీంతో పాకిస్థాన్ కు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాకిస్థాన్ కు మిత్ర దేశంగా ఉంటూ వస్తున్న అమెరికా.. ఇలా ఒక్కసారిగా ప్లేట్ టర్న్ చేయడంపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇటీవల భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ డీల్ ప్రకారం భారతీయ ఉత్పత్తులపై సుంకాలు 18 శాతానికి తగ్గాయి. అయితే ఇంటెరిమ్ ట్రేడ్ అగ్రీమెంట్ లో భాగంగా అమెరికా శనివారం విడుదల చేసిన భారత్ మ్యాప్ లో భారత భూభాగాన్ని పూర్తిగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ తో పాటు అటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) కూడా భారత భూభాగంలోనే ఉందని పేర్కొంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..? భారత్- చైనా మధ్య వివాదంగా ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా భారత భూభాగం పరిధిలోనే ఉందని ఆ మ్యాప్ ద్వారా స్పష్టం చేసింది. దాంతో భారత శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్ లకు అమెరికా ఒకేసారి షాక్ ఇచ్చినట్లు అయింది.

ఇక ఇటీవల కాశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగం అవుతుందని కీలక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 5 కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ఈ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం పరిష్కరించే వరకు దక్షిణాసియాలో శాంతి నెలకొనదని తెలిపారు.












Click it and Unblock the Notifications