US vs Venezuela war:అమెరికా దెబ్బకు వెనిజులా విలవిల..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ ప్రకటన చేశారు. వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ పట్టుబడ్డారని ట్రంప్ పేర్కొన్నారు. సమన్వయంతో కూడిన సైనిక చర్య ద్వారా వారిద్దరిని వెనిజులా నుండి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

అమెరికాకు, వెనిజులాకు మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మదురో ప్రభుత్వాన్ని అప్రజాస్వామికమైనదిగా అమెరికా భావిస్తోంది. ట్రంప్ తన పాత హయాంలో కూడా మదురోను గద్దె దించడానికి అనేక ప్రయత్నాలు చేశారు.ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి మినిట్-టు- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
ట్రంప్ ప్రెస్ మీట్
* గత రాత్రి మా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి
* మదురో ఆయన భార్యను చట్టం ముందు నిలబెడతాం
* ప్రస్తుతం వెనిజులను మా అధీనంలో నడుపుతాం
* మా బలగాలు అద్భుతంగా పని చేశాయి
* ఆయిల్ వనరులపై సమీక్ష చేస్తాం
* వెనిజులా పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం
* వెనిజులా ప్రజలకు శుభాకాంక్షలు
* వెనిజులా పై ఆధిపత్యం చెలాయించే అవకాశం మరొకరికి ఇవ్వం
* వెనిజులా సంక్షేమం కోసం పనిచేస్తాం
* narco terror కింగ్ పిన్ గా మదురో ఉన్నాడు
* వెనేజులలో పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొస్తాం
* వెనిజులా ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం
వెనీజులా నియంత అయిన నికోలస్ మదురోనూ చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు అమెరికా సైన్యం పోరాటం చేసిందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే ఇలాంటి పోరాటం ఎప్పుడూ జరగలేదు. ఇటీవల ఇరాన్ పై మిడ్ నైట్ హామర్ ఆపరేషన్ చేపట్టి.. న్యూక్లియర్ సైట్స్ ను అమెరికా సైన్యం ధ్వంసం చేసిన విషయం తెలిసిందేనని ట్రంప్ తెలిపారు. వెనీజులాపై జరిపిన దాడిలో మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్లు ఇప్పుడు అమెరికా న్యాయ స్థానాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది.
వెనీజులాపై అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తన డైరెక్షన్ లో అమెరికా సైన్యం వెనీజులా రాజధాని కరాకస్ పై దాడులు నిర్వహించిందన్నారు. ఈ దాడిలో అమెరికా సైన్యం వీరోచిత పోరాటం చేసిందని ప్రశంసించారు. వరల్డ్ వార్ 2 నుంచి అమెరికా సైన్యం ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారని ట్రంప్ అన్నారు.
వెనీజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ ను తాను లైవ్ లో చూశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఫ్లోరిడాలోని మార్- ఏ- లాగో రిసార్ట్ నుంచి రియల్ టైమ్ లో చూశానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫోక్స్ న్యూస్ కు ఇచ్చిన సమాధానంలో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైన్యంలో ఎవరూ మృతి చెందలేదని స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని స్పష్టం చేశారు.
వెనీజులాపై అమెరికా జరిపిన సైనిక దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టును చైనా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చైనా పేర్కొంది. అమెరికా ఆధిపత్య ధోరణి అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని మండిపడింది. అమెరికా.. కరేబియన్ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తోందని తెలిపింది.
వెనిజులా నాయకుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్‌లు న్యూయార్క్‌లో క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విధ్వంసకర ఆయుధాల కలిగి ఉండటం,అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర తదితర ఆరోపణల నేపథ్యంలో తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.













Click it and Unblock the Notifications