Israel-Palestine war : ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి ! బయల్దేరిన అమెరికా యుద్ధనౌకలు- భీకర పోరు
ఇజ్రాయెల్ పై అత్యంత వ్యూహాత్మకంగా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ జరుపుతున్న దాడులు ఆ దేశాన్ని ఉక్కికిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లుతుండగా... అమెరికాతో పాటు పలు ఇజ్రాయెల్ మిత్రదేశాల పౌరుల కిడ్నాప్ లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో హమాస్ పై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో పలు విదేశీ పౌరుల్ని తీవ్రవాదులు చంపేస్తున్నారు.
ఇజ్రాయెల్ లో తమ పౌరుల్ని హమాస్ చంపేస్తునట్లు నిర్ధారించుకున్న అమెరికా.. తక్షణం తమ యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని కూడా పంపుతోంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలో బయలుదేరాయి. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది. తద్వారా హమాస్ తో పాటు పాలస్తీనాపై భీకర పోరు తప్పేలా లేదు.

గాజా స్ట్రిప్ నుంచి హమాస్ జరుపుతున్న తీవ్ర దాడుల్లో ఇజ్రాయెల్ లో భారీ సంఖ్యలో పౌరులు కూడా చనిపోతున్నారు. అంతేకాదు మోటార్ పారా గ్లైడర్ల ద్వారా వచ్చిన హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్ లో భారీ సంఖ్యలో పౌరుల్ని, ముఖ్యంగా విదేశీ పౌరుల్ని అపహరించుకుని పోయారు. దీంతో ఇజ్రాయెల్ దిక్కుతోచని స్ధితిలో పడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మిత్రదేశాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి.
ఇజ్రాయెల్ మిత్రదేశాల్లో బ్రిటన్, థాయిలాండ్, నేపాల్ వంటి దేశాల పౌరులు కూడా కిడ్నాప్ అయిన వారిలో ఉన్నారు. దీంతో ఆయా దేశాలన్నీ కలిసి ఇప్పుడు పాలస్తీనాపై యుద్ధానికి సిద్దమవుతున్నాయి. ముందుగా అమెరికా రంగంలోకి దిగింది. ఇవాళ సాయంత్రానికి అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు ఇజ్రాయెల్ తీరానికి చేరుకుంటాయని అంచనా. ఆ తర్వాత పోరు మరింత తీవ్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన దాదాపు 2 వేల మంది వరకూ చనిపోయారని అంచనా. వేల సంఖ్యలో క్షతగాత్రులు కూడా అవుతున్నారు. వీరి గాథలు హృదయవిదారకంగా ఉంటున్నాయి.












Click it and Unblock the Notifications