viral video:వావ్.. అమెరికా అమ్మాయి భాంగ్రా డ్యాన్స్, వైరల్..
బాంగ్రా.. ఇదీ పంజాబీ డ్యాన్స్, ఇదీ అందరూ అనుసరిస్తారు. మిగతా వారు కూడా చేస్తుంటారు. అయితే అమెరికా అమ్మాయి కూడా బాంగ్రా చేస్తోంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇన్ స్టా షేక్ అవుతుంది. అందరూ వావ్ అంటున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్ చూడముచ్చటగా చేసిందని అంతా అంటున్నారు. మరీ ఆ వీడియోను మీరు కూడా చూడండి.
అమెరికాకు చెందిన ఒమాలా భాంగ్రా పాటలకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్, పంజాబీ పాటలకు ఆమె స్టెప్పులేశారు. ఇన్‌స్టా టైమ్‌లైన్ ఈ పాటలతో నిండిపోయింది. ఇన్‌స్టా బయోలో సెల్ప్ టాట్ బాంగ్రా డ్యాన్స్ అని రాసి ఉంది. ఆమెకు భాంగ్రా అంటే ఎంత ఇష్టమో ఈ బయోనే చెబుతోంది. ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆ మూవ్‌మెంట్స్‌కి అంతా ఫిదా అవుతున్నారు.

పోస్ట్ చేసిన రీల్ చాలా మంది చూశారు. చిడి బ్లౌరి అనే పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు అంతా వావ్ అంటున్నారు. టీ షర్ట్, లెగ్గింగ్‌తోనే కష్టమైన స్టెప్పులనూ సింపుల్‌గా వేసింది. ఆమె చేసిన ఓ రీల్‌కు వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ పంజాబీ పాటకు ఆమె లిప్ సింక్ చేస్తూ, చేసిన రీల్‌కి నెటిజన్లు "వావ్" అని కామెంట్లు చేశారు.
కుర్తా పైజామా, దుపట్టా వేసుకుని ఇండియన్ జ్యూలరీతో ఇంప్రెస్ చేశారు. వరుసగా బాలీవుడ్, పంజాబీ సాంగ్స్ రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. చాలా మంది వావ్ అని అంటున్నారు. చక్కగా డ్యాన్స్ వేసిందని అంతా అంటున్నారు. భారతీయుల మాదిరిగానే చిందులేసింది. అందుకే అంతా కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications