వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్ధాన్ శృంగార తార వీణామాలిక్‌‌కు 26 ఏళ్ల జైలు శిక్ష

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్ధాన్ అందాల తార వీణామాలిక్‌తో పాటు ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయిస్దా వాహిది.. మీడియా టైకూన్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్‌లకు అక్కడి కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ, దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని యాంటీ టెర్రరిజం కోర్టు అభిప్రాయపడింది.

ఇటీవలే వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్‌లు జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు గత మే నెలలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ కార్యక్రంలో భాగంగా బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్‌లు డాన్స్ చేసారు.

Veena Malik, media mogul get 26 years in jail for blasphemy

ఆ పాట ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. ఈ కార్యక్రమం ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దోషులకు 26 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు జడ్జి షాబ్జా ఖాన్ తన తీర్పులో పేర్కొన్నారు. 40 పేజీల తీర్పులో ఆ నలుగురిని వెంటనే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులకు తెలిపారు.

దోషులు ఈ కేసుకు సంబంధించి గిల్గిత్-బాల్టిస్తాన్‌లో ఉన్న ప్రాంతీయ హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు పాకిస్ధాన్ బయట నివసిస్తున్నట్లు ఉన్నట్లు తేలింది. మిలిటెంట్ గ్రూపుల నుంచి ప్రమాదం ఉందని తెలిసిన జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్‌ యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో నివసిస్తుండగా... మిగిలిన ముగ్గురు కూడా పాకిస్ధాన్ బయట నివిస్తున్నారు.

ఐతే వీరిని ఎప్పుడు అరెస్టు చేస్తారనేది తెలియదు.
ఇస్లాం మతాన్ని కించపరిచారన్న ఆరోపణలు రావడంతో షయిస్దా వాహిది, జియో టీవీ యాజమాన్యం క్షమాపణలు కోరినా... పాకిస్ధాన్‌లోని తీవ్రవాదులు వాటిని అంగీకరించడానికి నిరాకరించారు. పాకిస్ధాన్‌లోని ముఖ్య పట్టణాలైన కరాచీ, ఇస్లామాబాద్‌లలో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

English summary
Pakistan actor Veena Malik, her husband, and the owner of the country's biggest media group, Geo TV, have been sentenced to 26 years in prison by an anti-terrorism court for allegedly airing a blasphemous programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X