
శృంగార సమయంలో పురుషాంగానికి అనుకోని గాయం-వైద్య చరిత్రలోనే మొట్టమొదటి అరుదైన కేసు
బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల ఓ వ్యక్తి మెడికల్ పరంగా చరిత్ర సృష్టించాడు. అయితే అతనేమీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసినందుకో... సరికొత్త పరిశోధనలు చేసినందుకో ఈ చరిత్రకు కారణమవలేదు. నిజం చెప్పాలంటే అతనో బాధితుడు. అవును... భాగస్వామితో శృంగార సమయంలో అతని పురుషాంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పురుషాంగం లోపల నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. ప్రపంచ వైద్య చరిత్రలో ఇలాంటి అరుదైన గాయమైన మొట్టమొదటి వ్యక్తి ఇతనేనని యూకె వైద్యులు చెబుతున్నారు.

నొప్పితో విలవిల్లాడిపోయాడు...
గిజ్మోడో అనే యూకె బ్రిటీష్ మెడికల్ జర్నల్ ద్వారా ఈ కథనం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్న సమయంలో... అనుకోకుండా ఆమె జననాంగాలకు మధ్య భాగంలో అతని పురుషాంగం బలంగా తాకింది. దీంతో పురుషాంగం లోపల నిలువునా ఫ్రాక్చర్ (చీలిక) ఏర్పడింది. దీంతో అతను తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు.నిజానికి అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయిన సమయంలో పెద్దగా శబ్దమేమీ రాలేదు. కాసేపటి తర్వాత గానీ అతను అంగస్తంభన కోల్పోలేదు.

వైద్యులు ఏం చెబుతున్నారు...
బాధితుడు వెంటనే ప్రముఖ యూరాలజిస్ట్‌ను సంప్రదించి తన పరిస్థితిని వివరించాడు. దీంతో ఎంఆర్ఐ స్కాన్ చేయగా... అతని పురుషాంగం లోపల మూడు సెంటిమీటర్ల మేర నిలువునా చీలిక ఏర్పడినట్లు గుర్తించారు. సాధారణంగా పురుషాంగంలో అడ్డుగా చీలిక ఏర్పడటం సహజం. కానీ ఈ వ్యక్తిలో నిలువుగా చీలిక ఏర్పడటంతో దీన్ని అరుదైన కేసుగా భావిస్తున్నారు. శస్త్ర చికిత్స తర్వాత ఆ బాధితుడు త్వరగానే కోలుకున్నాడు. అంతేకాదు,ఒకవేళ మున్ముందు అతనిలో మరే సమస్యలు తలెత్తకపోతే ఆర్నెళ్ల వ్యవధిలోనే అతను సహజ శృంగారంలో పాల్గొనగలడని వైద్యులు వెల్లడించారు.

శృంగార సమయంలోనే ఎక్కువగా...
సాధారణంగా 88.5 శాతం పెనిల్ ఫ్రాక్చర్ ఘటనలు శృంగార సమయంలోనే జరుగుతాయని యూరాలజిస్టులు చెబుతున్నారు. అందులోనూ హారిజాంటల్ ఫ్రాక్చర్స్(అడ్డుగా ఏర్పడే చీలికలు) ఎక్కువగా జరుగుతుంటాయని... ఇలా నిలువునా ఫ్రాక్చర్స్ ఏర్పడే ఘటనలు అరుదని చెబుతున్నారు. పురుషాంగం స్తంభించి ఉన్నప్పుడు అసాధారణంగా దాన్ని వంచడం వల్ల కూడా ఇలాంటి ఫ్రాక్చర్స్ ఏర్పడుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఇలా పురుషాంగాన్ని వంచే ఒకరకమైన ప్రాక్టీస్ ఉందని... దాని కారణంగా అక్కడ పెనిల్ ఫ్రాక్చర్ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని చెబుతున్నారు.