• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...

|
Google Oneindia TeluguNews

తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లిన 8ఏళ్ల బాలుడు.. సరదాగా నదిలో ఈతకు దిగాడు.. మొసలి రూపంలోని ప్రమాదాన్ని ఆ తండ్రికొడుకులు గుర్తించలేకపోయారు.. ఒడ్డున నిలబడి తండ్రి చూస్తుండగానే.. రాక్షసిలాంటి మొసలి బాలుణ్ని అమాంతం మింగేసింది.. ఆ షాక్ లోనే నీళ్లలోకి దూకిన తండ్రి.. మొసలితో తలపడ్డాడు.. చివరికి రెస్క్యూ సిబ్బంది ఆ భారీ మొసలిని బంధించి, పొట్ట చీల్చేశారు.. వివరాల్లోకి వెళ్తే..

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంviral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

కలిమంతన్ దీవిలో ఘటన..

కలిమంతన్ దీవిలో ఘటన..

ప్రపంచంలోనే అతిపెద్ద దీవుల సమదాయ దేశంగా ఇండోనేసియా కొనసాగుతున్నది. అక్కడ 17వేలకుపైగా దీవులుండగా, వాటిలో అతిపెద్ద దీవుల్లో ఒకటైన కలిమంతన్ దీవిని ఇటీవలే దేశరాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్రాంతాల్లో మొసళ్ల బెడద తీవ్రంగానే ఉంటుందక్కడ. తాజా ఘటన కలిమంతన్ తూర్పు భాగంలోని ఓ మారు మూల పల్లెలో చోటుచేసుకుంది. 26 అడుగుల పొడవైన మొసలిని చంపి, దాని కడుపు కోసి అది మింగిన బాలుడ్ని బయటకు తీసిన ఘటన తాలూకు ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

మొసలితో తండ్రి పోరాటం..

మొసలితో తండ్రి పోరాటం..

ఈస్ట్‌ కలిమన్‌తన్‌కు చెందిన దిమస్‌ ముల్కన్‌ సపుత్ర అనే ఎనిమిదేళ్ల బాలుడు బుధవారం తండ్రి సుబ్లియాన్షాతో కలిసి చేపలు పట్టడానికి దగ్గరలోని నదికి వెళ్లాడు. తండ్రి చేపలు పడుతుండగా, కొడుకు ఈత కోసం నదిలోకి దిగాడు. 26 అడుగుల పొడవైన భారీ మొసలి బాలుడిపై దిమస్‌పై దాడి చేసింది. అమాంతం వాడిని మింగేసే ప్రయత్నం చేయగా, కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంలో తండ్రి కూడా నదిలోకి దూకేశాడు. ధైర్యంతో ఒంట్లో ఉన్న శక్తిని మొత్తం కూడదీసుకొని.. మొసలి తలపై పిడిగుద్దులు కురిపించాడు. కానీ అది నీటి లోతుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత..

కత్తులతో పొట్ట కోసి చూడగా..

బాలుణ్ని మొసలి మింగేసిందన్న సమాచారంతో గ్రామస్తులంతా నదిలో గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని నది మొత్తం వెతికారు. బుధవారం బాలుణ్ని మింగేసిన మొసలి.. గురువారానికి గానీ చిక్కలేదు. 26 ఫీట్ల పొడవున్న ఆ భారీ మొసలిని అధికారులు చంపేశారు. అనంతరం కత్తులతో దాన్ని పొట్టను చీల్చి చూడగా, అప్పటికే బాలుడు కన్నుమూశాడు. మొసలి పొట్టను చీల్చి బాలుడిని బయటకు తీస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి మృతదేహాన్ని చూసి అందరూ విలపించారు. మొసళ్లతో పోరు పడలేక గతేడాది స్థానికులు వందల సంఖ్యలో జీవాలను చంపేశారు.

English summary
An eight-year-old boy has been cut out of the stomach of a crocodile after he was swallowed whole in Indonesia. Dimas Mulkan Saputra was fishing in a river with his father when he strayed from the shore in East Kalimantan, Indonesia, on Wednesday morning. A 26ft long crocodile then dragged Dimas away as the boy's father Subliansyah chased the reptile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X