
Viral video: ఐదోఅంతస్తు నుండి పడిపోయిన చిన్నారి.. గాలిలోనే క్యాచ్ పట్టి కాపాడిన సూపర్ మ్యాన్
సూపర్ మ్యాన్ లను సినిమాలలో చూడడం తప్ప నిజ జీవితంలో చూసి ఉండం. కానీ నిజజీవితంలోనూ అలాంటి సూపర్ మ్యాన్ లు ఉంటారని, ఊహించని కష్టం నుంచి కాపాడతారని తాజాగా వైరల్ అవుతున్న వీడియో ద్వారా అర్థమవుతుంది. ఐదవ అంతస్తు నుండి కిందికి పడిన ఓ బాలికను, క్రింద పడకుండా గాలిలోనే పట్టుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు సూపర్ హీరోగా అందరి మన్ననలు పొందుతున్నారు.
Viral news: ఇళ్ళు ఊడ్చేవారికి లక్షల్లో శాలరీ; ఏడాదికి కోట్లలో ప్యాకేజీలు; ఎక్కడో తెలుసా!!

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్నారి ఐదవ అంతస్తు నుండి తన ఇంటి కిటికీ నుండి క్రిందికి పడిపోతున్న క్రమంలో దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ అమ్మాయిని బంతి లాగా సూపర్ క్యాచ్ పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే

ఐదో అంతస్తు నుండి పడిపోయిన చిన్నారిని పట్టుకున్న వ్యక్తి
ఐదో అంతస్థు నుంచి కింద పడిన రెండేళ్ల బాలికను పట్టుకుని ఓ వ్యక్తి హీరో అయిన ఘటన చైనాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 31 ఏళ్ల షెన్ డాంగ్ తన కారును టోంగ్‌జియాంగ్‌లో పార్క్ చేసి రోడ్డు గుండా వెళుతున్నాడు. అతను అక్కడ సమీపంలోని బ్యాంకులో పనిచేస్తున్నాడు. కారు పార్క్ చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్తున్న షెన్ డాంగ్ దంపతులకు పెద్ద శబ్దం వినిపించింది. ఓ చిన్నారి ఎత్తయిన భవనం ఐదో అంతస్తు కిటికీ నుంచి కిందకు జారి పడిపోతోంది. దీంతో షెన్ డాంగ్, అతడి భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు.

గాలిలో బంతిలా పాపను క్యాచ్ పట్టిన వ్యక్తి ..
కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి క్షణాలలో మళ్లీ కిందకు జారి భూమి మీద పడి పోయే క్రమంలో, గాలిలోనే పాపను బంతిలా క్యాచ్ పట్టుకున్నాడు సదరు వ్యక్తి. చిన్నారి బిల్డింగ్ పైనుండి కిందకి పడి పోతున్న క్రమంలో పెద్దగా కేకలు వేయడం, వాటిని విన్న షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి.

ఈ వీడియో ను సోషల్ మీడియాలో విడుదల చేసిన స్థానిక పోలీసులు
సకాలంలో బిడ్డను పట్టుకోవడం తన అదృష్టమని షేన్ తెలిపాడు. ఇది చేయలేకపోతే, తాను చాలా బాధపడే వాడినని పేర్కొన్నారు. షేన్ సంఘటన జరిగిన ప్లేస్ లో లేకుంటే, అంత ఖచ్చితంగా పట్టుకోకుంటే, చిన్నారికి కచ్చితంగా ఏదైనా జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి కింద పడలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన ఫుటేజీని స్థానిక పోలీసులు వీబోలో విడుదల చేశారు.

సూపర్ హీరో అంటూ పాప ప్రాణాలు కాపాడిన వ్యక్తికి కితాబు
వీబో అనేది మైక్రోబ్లాగింగ్ సైట్ ఇది ట్విట్టర్ యొక్క చైనీస్ వెర్షన్. ఈ చిన్నారి ప్రాణాలను షేన్ కాపాడిన తీరు, అతని వీడియో కనిపించిన తర్వాత, వీబో వినియోగదారులు అతన్ని 'సూపర్ హీరో' అని పిలుస్తున్నారు. ఈ ప్రమాదంలో బాలికకు గాయాలయ్యాయి. బాలిక కాళ్లు, ఊపిరితిత్తులకు గాయాలు కాగా, చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అదే సమయంలో చిన్నారిని పట్టుకున్న షేన్ మొబైల్ పగిలిపోయింది. మొబైల్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు పోతే తీసుకురాలేమని అంటున్నారు నెటిజన్లు.