వైరల్ వీడియో : పుతిన్ తో భేటీ తర్వాత కిమ్ డీఎన్ఏ తుడిచేసిన సెక్యూరిటీ..!
తన చిత్ర విచిత్రమైన నిర్ణయాలు, విధానాలు, లైఫ్ స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా ఇలాంటిదే ఓ పని చేసి చర్చనీయాంశమయ్యారు. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన మిలిటరీ పరేడ్ కు ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ నుంచి ఓ ప్రైవేటు రైలులో బయలుదేరి ఒక రోజు ఆలస్యంగా గమ్యానికి చేరుకున్న కిమ్.. ఆ తర్వాత చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్ పింగ్, వ్లాదిమీర్ పుతిన్ తో భేటీ అయ్యారు.
ఈ భేటీల సందర్భంగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. అనంతరం ఎవరికి వారు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత అసలు విషయం జరిగింది. కిమ్ భద్రతా సిబ్బంది వీరిద్దరి భేటీ జరిగిన చోటుకు వెంటనే వాలిపోయారు.

⚡️After Kim Jong-un’s meeting with Putin, his team thoroughly wiped the chair and table he use, reportedly to remove any possible DNA traces.
— War Intel (@warintel4u) September 3, 2025
- Kremlin reporter Alexander Yunashev pic.twitter.com/6ZeWfPLh1Z
కిమ్ జోంగ్ ఉన్ కూర్చొన్న కుర్చీని హడావిడిగా తుడిచేయడం ప్రారంభించారు. దీంతో వీరు ఎందుకిలా చేస్తున్నారో కాసేపు ఎవరికీ అర్దం కాలేదు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. కిమ్ జోంగ్ ఉన్ డీఎన్ఏ ఆధారాలు ఆయన కూర్చొన్న కుర్చీలో లేకుండా చేసేందుకే వారు ఇలా చేశారని తెలిసింది. తద్వారా కిమ్ భద్రత విషయంలో, ఆయన డీఎన్ఎ శాంపిల్స్ విషయంలో ఆయన భద్రతా సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉంటారో మరోమారు ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో భద్రతా సిబ్బంది ఇలా కిమ్ కూర్చొన్న కుర్చీని తుడుస్తున్న వీడియో కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications