Viral Video: ప్రాణాలు లెక్క చేయకుండా నదిలో దూకాడు.. పసివాళ్ల ప్రాణాలు రక్షించాడు..
ఓ వ్యక్తి పెద్ద సహాసమే చేశాడు. ప్రాణాలను లెక్క చేయకుండా వేగంగా ప్రవాహిస్తున్న నదిలోకి దూకి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత శుక్రవారం ఒమన్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో బహ్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారు. తాటి చెట్ల కొమ్మలు పట్టుకుని బిక్కు బిక్కు మంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
అప్పుడే నదిని చూసేందుకు వచ్చిన అలీ బిన్ నాసర్ అల్ వార్ది అనే వ్యక్తి పిల్లలను చూశాడు. పసి పిల్లలను ఎలాగైనా రక్షించాలనకున్న అతను వాగులోకి దూకి పిల్లలను కాపాడాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
مشهد بطولي لـ شاب عماني ينقذ طفلين من موت محقق pic.twitter.com/sWoyKfj35V
— جريدتكم (@ImeGrop) June 25, 2022
"ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఇద్దరు పిల్లలు తాటి చెట్ల కొమ్మలకు చిక్కుకున్నట్లు కనిపించింది.నేను నా డిష్‌డాషాను తీసివేసాను. మా నాన్న నా నడుము చుట్టూ తాడును కట్టాడు. దాని ఒక చివర నాన్న గట్టిగా పట్టుకున్నాడు." అని అల్ వార్ధి వివరించాడు. "తాను పిల్లల మరణాన్ని రక్షించడం గురించి మాత్రమే ఆలోచించాను. నేను ప్రవాహం శక్తిని ప్రతిఘటిస్తూ పిల్లలకు ధైర్యం చెప్పాను. గట్టిగా పట్టుకుని ఉండమని వారికి చెప్పాను. నేను ఎలాగో వారిని చేరుకున్నాను" అని చెప్పాడు.

తను పిల్లలను తాకగానే, వారి కళ్లు నుండి కన్నీళ్లు రావడం ప్రారంభించాయని అలీ బిన్ నాసర్ అల్ వార్ది తెలిపారు. "నేను వారిని కౌగిలించుకున్నాను, చింతించవద్దని వారిని ఓదార్చాను. ఇద్దరు పిల్లలను రక్షించడం సంతోషంగా. నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను"అల్ వార్ధి చెప్పాడు.












Click it and Unblock the Notifications