వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. న్యూయార్క్ వీధుల్లో ష్కర్ట్ వేసుకొని మరీ..

|
Google Oneindia TeluguNews

పుష్ప మేనియా మాములుగా లేదు.. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పుష్ప రాజ్ హవా మాములుగా లేదు. తగ్గేదే లే అని అంతా అంటున్నారు. సామి సామి పాటకు కూడా మాములు హైప్ రాలేదు. ఇంకేముంది ఓ కొరియో గ్రాఫర్ ఏకంగా న్యూయార్క్ వీధుల్లో స్కర్ట్ వేసుకొని మరీ డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

 గాగ్రా వేసుకొని..

గాగ్రా వేసుకొని..


జైనిల్ మెహతా అనే కొరియోగ్రాఫర్ గాగ్రా వేసుకొని.. పుష్క మూవీలో గల సామి సామి సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అదీ కూడా న్యూయార్క్ వీధుల్లో.. అయితే అతను డ్యాన్స్ చేసే సమయంలో చాలా మంది ఉన్నారు. ఇంకేముంది ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోను మెహతా ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

దుప్పట్ట.. గాగ్రా

దుప్పట్ట.. గాగ్రా


షర్ట్ వేసుకొని అతను.. ఎల్లొ దుప్పట్టగా చేతికి చుట్టుకున్నాడు. ప్యాంట్‌పై గాగ్రా కూడా వేసుకున్నాడు. అలా అతను డ్యాన్స్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా చక్కగా డ్యాన్స్ వేశారు. మీకు 60 సెకన్లు సరిపోదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంతకుముందు మెహతా ఇన్ స్టాలో తన గురించి రాసుకున్నాడు. చిన్నతనంలో కూడా ఇలా స్కర్ట్ వేసుకున్నానని చెప్పారు. 7 ఏళ్ల ప్రాయంలో డ్యాన్స్ చేయడం ప్రారంభించానని తెలిపారు. తన తల్లి దుప్పట్ట, స్కర్ట్ దొంగిలించేవాడని చెప్పుకున్నారు. గదికి గడియ పెట్టి రొమాంటిక్ మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేసేవాడినని తెలిపారు.

చిన్నతనం నుంచి అలా


ఆ సమయంలో తాను గదికి గడియ ఎందుకు పెట్టుకున్నానో అర్థం కావడం లేదన్నారు. పురుషులు ఇలా స్కర్ట్ వేసుకొని డ్యాన్స్ చేయడం అరుదు.. కానీ తనకు అలా అలావాటు అయ్యిందని చెప్పారు. కానీ దీనిని సమాజం ఎలా తీసుకుంటుందనే భయం ఉండేదని చెప్పారు. చదువు కోసం లాస్ ఏంజెల్స్ వచ్చానని.. అక్కడ తనకు విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. తన ఆలోచనలకు మరింత పదును పెట్టానని చెప్పారు. తాను స్కర్ట్ ధరించడంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. భయం తగ్గించుకునే ప్రయత్నం చేశానని చెప్పారు.

English summary
video showing a choreographer from Mumbai dancing on a street of New York dressed in 'Ghaghra' is winning the hearts of social media users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X