వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్‌ను అంత‌ర్జాతీయ కోర్టుకు ఈడ్చుకురావాలి.. రష్యా సైనికులు ఉగ్ర‌వాదులే : జెలెన్‌స్కీ కీల‌క వ్యాఖ్య‌లు

|
Google Oneindia TeluguNews

రష్యా సైనికుల అరాచకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనిషిలో ఉండకూడని లక్షణాలన్నీ వారిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులపై మానవత్వం లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఆత్యాచారలకు పాల్పడ్దారని , చిన్నారులను కూడా వదలకుండా క్రూరత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు. నగరాలను శవాల దిబ్బలుగా మార్చారని ఫైర్ అయ్యారు.

ఐరాస భద్రతా మండలి వేదికగా జెలెన్‌స్కీ ప్ర‌సంగం

ఐరాస భద్రతా మండలి వేదికగా జెలెన్‌స్కీ ప్ర‌సంగం

రష్యా దురాక్రమణకు దిగిన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దాదాపు నెలరోజులుగా రష్యా దళాలు తమ దేశంపై బాంబులప వర్షం కురిపిస్తోందన్నారు. మాస్కో సైనికులను ఉగ్రవాదులతో పోల్చారు. ఉగ్రవాదులకు వారికి తేడా లేదన్నారు. తమ దేశ పౌరులపై యుద్ధ ట్యాంకులు ఎక్కించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల ముందే మహిళలపై అత్యాచాలకు పాల్పడ్డార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. చిన్నారుల ఎదుటే వారిని తుపాకులతో ఘోరంగా చంపేశారని ఆరోపించారు. ఇంతటి దారుణాలు చూసిన తర్వాత రష్యాతో చర్చలు జరపడమూ కూడా కష్టమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 ర‌ష్యాతో చర్చ‌లు క‌ష్ట‌మే..

ర‌ష్యాతో చర్చ‌లు క‌ష్ట‌మే..


బూడా, మరియుపోల్, కీవ్ చివారు ప్రాంతాల్లో అత్యంత దారుణం రష్యా దళాలు ప్రవర్తించాయని జెలెన్ స్కీ ఫైర్ అయ్యారు. తమ పౌరులపై క్రూరంగా అఘాయిత్యాలకు పాల్పడాలని ఆదేశించిన వారిని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చుకురావాలంటూ పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై జెలెన్ స్కీ విరుచుకుపడ్డారు. రష్యాను వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమపై రష్యా దారుణంగా బాంబులతో విరుచుకుపడుతున్నప్పుడు .. భద్రతా మండలి రక్షణ కల్పించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో భద్రతా మండలి ఏమైపోయిందని నిలదీశారు.

 పుతిన్‌ను అంత‌ర్జాతీయ కోర్టుకు ఈడ్చుకురావాలి..

పుతిన్‌ను అంత‌ర్జాతీయ కోర్టుకు ఈడ్చుకురావాలి..


రెండో ప్రపంచ యుద్థం తర్వాత ఇంత ఘోరంగా ఎక్కడా జరగలేదని జెలెన్ స్కీ అన్నారు. తమను నిశబ్ద బానిసలుగా మార్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ప్రయత్నించారని మండిపడ్డారు. కానీ మాస్కో చేసిన ప్రతి చర్యలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు . రష్యా దాడులను తమ ఆర్మీ, పౌరులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ దేశ జాతిని, సంస్కృతిని నాశనం చేశారని మండిపడ్డారు. ఏనాటికైనా రష్యా భారీ మూల్యం చెట్టించుకోక తప్పదని హెచ్చరించారు.

English summary
Russian soldiers are no different from terrorists. Negotiations are difficult: Zhelensky's key remarks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X