అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ చాపర్ డీల్: భారత్‌కు ఏజెంట్ క్రిస్టియన్ మైఖేల్
న్యూఢిల్లీ/యూఏఈ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ స్కాం మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్‌ను మంగళవారం రాత్రి ఏ సమయానికైనా భారత్‌కు తీసుకు రానున్నారు. చాపర్ స్కాంలో పలు భారతీయ విచారణ సంస్థలకు ఆయన వాంటెడ్. ఆయనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.
మైఖైల్‌ను యూఏఈ పోలీసులు 2017 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. అక్కడి స్థానిక మీడియా ప్రకారం ఇప్పటికే ఆయనను భారత్ తరలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అక్కడి మీడియా ప్రకారం మంగళవారం రాత్రి పదకొండు గంటలకు ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

కాగా, అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్‌ల లావాదేవీలో బ్రిటన్‌కు చెందిన ఏజంట్ క్రిస్టియన్ మైఖల్‌ను భారత్‌కు అప్పగించేందుకు దుబాయ్ కోర్టు కొద్దినెలల క్రితం అంగీకరించింది. గతంలో మైఖల్‌ను అరబ్ ఎమిరేట్స్‌లో అదుపులోకి తీసుకోగా అతనిని భారత్‌కు అప్పగించే అంశంపై అక్కడి కోర్టులో వాదనలు జరిగాయి.
వీవీఐపీ హెలికాప్టర్‌ల కొనుగోలులో మైఖల్ ఆధ్వర్యంలో వేల రూ.కోట్లు లంచాల రూపంలో చేతులు మారాయని అతని మీద అభియోగాలు నమోదు చేశారు. ఈ స్కాం 2007లో తెరపైకి వచ్చింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం 12 అత్యంత అధునాతన హెలికాప్టర్లను రాష్ట్రపతి, ప్రధాని లాంటి వీవీఐపీల కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఆరోపణలు రావడంతో 2014లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫిన్‌మెక్కానికా కంపెనీ భారత్‌లో లంచాలు చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అధికారి ఎస్పీ త్యాగిని 2016లో అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో లంచాల విషయం బయటపడగానే డీల్‌ను రద్దు చేశామని, సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో ఉంచడంతోపాటు భారత్‌లో ఉన్న కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications