వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీలోలుడినా, నీ భర్త మాటేమిటి: హిల్లరీపై ట్రంప్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల అధ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ప్రధాన పోటీదారులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తనను స్త్రీలోలుడని నిందించడం ద్వారా హిల్లరీ క్లింటన్ ఈ మాటల యుద్ధాన్ని ప్రారంభించారని ట్రంప్ ఆరోపించారు. ఆమె భర్త అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను ప్రపంచంలోనే అత్యంత స్ర్తిలోలురుల్లో ఒకరని ఆరోపించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ వివాహేతర సంబంధాలను ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. క్లింటన్‌కు బోలెడంత మంది మహిళలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ‘హిల్లరీ క్లింటన్ నన్ను స్ర్తి లోలుడని నిందించారు. ఆమె భర్త ప్రపంచంలోనే అత్యంత స్ర్తిలోలురుల్లో ఒకరు' అని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ధ్వజమెత్తారు.

తనను స్ర్తిలోలుడిగా అభివర్ణిస్తూ హిల్లరీ క్లింటన్ చేసిన ఆరోపణలను ట్రంప్ కొట్టివేస్తూ, ఆమె ఇప్పుడు ఆ కార్డును తనకు వ్యతిరేకంగా ఉపయోగించడం ప్రారంభించినందున ఆమె భర్త వ్యవహారాన్ని ప్రస్తావించడం తప్ప తనకు మరోదారి లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో అందరికన్నా ముందువరసలో ఉన్న ట్రంప్ అన్నారు.

War of words between Hillary and Trump

మనం మాజీ అధ్యక్షుడి (బిల్ క్లింటన్) వెంటపడతామని 2 వేల మందికి పైగా హాజరైన తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ప్రత్యర్థి దెబ్బ కొట్టినప్పుడు మనం అంతకన్నా గట్టిగా తిప్పి కొట్టాలని కూడా ఆయన తన మద్దతుదారులతో అన్నారు.

కాగా, అధ్యక్ష పదవికోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న తన భార్య హిల్లరీ క్లింటన్‌కోసం నిధులు సేకరించాలని బిల్ క్లింటన్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నలభై ఏళ్లుగా హిల్లరీ తనకు తెలుసునని, ఆమె ఎంతో చురుకైన అంకితభావం కలిగిన వ్యక్తి అని, అధ్యక్షుడు ఒబామా సాధించిన ప్రగతి ఆధారంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మిగతా వారికన్నా సమర్థురాలని బిల్ క్లింటన్ ఇ-మెయిల్ సందేశంలో అన్నారు.

English summary
War of words took place between Hillary Clinton and Donald Trump in USA election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X