భారత్‌తో మళ్లీ యుద్ధం: పాకిస్తాన్ రక్షణ మంత్రి సంచలనం!
India-Pakistan: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం ఉందని.. ఆ అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసినప్పటికీ భారత సైన్యం వాటిని తిప్పికొట్టి పాకిస్తాన్ సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు భారత్ యుద్ధ విరమణకు అంగీకరించింది.

భారత్‌తో మళ్లీ యుద్దం
కొద్ది రోజుల క్రితం భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత పాక్ నాయకత్వంలో భయం, కోపం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. "పాకిస్తాన్‌కు భారత్‌తో మళ్లీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశం సంభవించడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం." అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ భారత్‌ను హెచ్చరించారు. "ఒకవేళ భారత్, పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ యుద్ధం జరిగితే, మేము గతంలో కంటే మెరుగ్గా పోరాడుతాము" అని అన్నారు. అయితే తాను ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ యుద్ధం వచ్చే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. చరిత్రను పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిన విషయం తెలిసిందే.
జనరల్ ద్వివేది హెచ్చరిక ఏమిటి?
కొద్ది రోజుల క్రితం భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ద్వివేది పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. "ఈసారి భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. 'ఆపరేషన్ సింధూర్ 1.0' సమయంలో మనం చూపిన సంయమనం ఇప్పుడు చూపించబోము. పాకిస్తాన్ మరోసారి ఏదైనా కుట్రకు పాల్పడితే, భౌగోళికంగా తమ ఉనికిని కొనసాగించాలా వద్దా అని ఆ దేశం ఆలోచించాల్సి ఉంటుంది. భారత్ మ్యాప్ నుంచి దాన్ని తుడిచిపెట్టేస్తుంది" అని ద్వివేది పరోక్షంగా హెచ్చరించారు. జనరల్ ద్వివేది చేసిన ఈ హెచ్చరిక నేపథ్యంలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications